CM Jagan : రేపు లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్ రేపు విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్‌లో జరుగనున్న వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు.

YSR Vahana Mitra 5th Installment
సీఎం వైఎస్ జగన్(CM Jagan) రేపు విజయవాడ(Vijayawada) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా విద్యాధరపురం స్టేడియం(Vidyadharapuram Stadium) గ్రౌండ్‌లో జరుగనున్న వైఎస్సార్ వాహన మిత్ర(YSR Vahana Mithra) పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు సీఎంఓ అధికారులు సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రసంగం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
