YS Vimala Reddy : అవినాష్ ఏ తప్పూ చేయలేదు.. సునీత కావాలనే చేస్తుంది
తండ్రిని చంపినవారికి సునీత(YS Sunitha) మద్దతివ్వడం చూసి చాలా బాధనిపిస్తుందని వైఎస్ వివేకా సోదరి విమలా రెడ్డి(YS Vimala Reddy) అన్నారు. అవినాష్(Avinash Reddy) ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని.. వివేకా హత్యలో అవినాష్ ప్రమేయం లేదని చెప్పారు. వివేకాను చంపిన దస్తగిరి బయట తిరుగుతున్నాడని.. తప్పు చేయనివారిని జైల్లో పెట్టారు..

YS Vimala Reddy
తండ్రిని చంపినవారికి సునీత(YS Sunitha) మద్దతివ్వడం చూసి చాలా బాధనిపిస్తుందని వైఎస్ వివేకా సోదరి విమలా రెడ్డి(YS Vimala Reddy) అన్నారు. అవినాష్(Avinash Reddy) ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని.. వివేకా హత్యలో అవినాష్ ప్రమేయం లేదని చెప్పారు. వివేకాను చంపిన దస్తగిరి(Dastagiri) బయట తిరుగుతున్నాడని.. తప్పు చేయనివారిని జైల్లో పెట్టారు..ఇది ఎంతవరకు సమంజసం? అంటూ ప్రశ్నించారు. తన కుటుంభం ఎవరినీ హత్య చేయలేదని మొదట సునీత చెప్పింది.. ఆ తరువాత ఆమె మాట మార్చిందని.. ఇది తప్పు అని మేము చెప్పినందుకు సునీత మాతో మాట్లాడడం మానేసిందన్నారు. ఏడుసార్లు అవినాష్ విచారణకు హాజరయ్యాడు కదా.. ఎందుకు మీడియా ఇంతగా హడావిడి చేస్తుంది.? అని ప్రశ్నించారు. అవినాష్ ఏ తప్పూ చేయలేదు.. త్వరలో అవినాష్ నిర్ధోషిగా బయటపడతాడన్న నమ్మకం నాకుందని విమలా రెడ్డి అన్నారు.
