YSR Kapu Nestham : నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు అందించిన ఆర్థిక సాయం రూ.2,029 కోట్లు
నిడదవోలు(Nidadavolu) నుంచి 'సూర్య' ప్రత్యేక ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) శనివారం తూర్పు గోదావరి(East Godhavari) జిల్లా నిడదవోలులో(Nidadavolu) పర్యటించారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకుని అక్కడ సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో(Public meet) పాల్గొన్నారు. ఈ

YSR Kapu Nestham
కాపు సామాజిక వర్గానికి అండ
నాలుగో విడత ‘కాపు నేస్తం’ నిధులు విడుదల
నిడదవోలు సభలో బటన్ నొక్కి జమ చేసిన సీఎం జగన్
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,57,844 మందికి లబ్ధి
నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు అందించిన ఆర్థిక సాయం రూ.2,029 కోట్లు
నిడదవోలు(Nidadavolu) నుంచి 'సూర్య' ప్రత్యేక ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) శనివారం తూర్పు గోదావరి(East Godhavari) జిల్లా నిడదవోలులో(Nidadavolu) పర్యటించారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకుని అక్కడ సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో(Public meet) పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ కాపునేస్తం ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. కాపునేస్తంతో ఒంటిరి మహిళలకు మేలు చేస్తున్నాం. వరుసగా ఐదేళ్ల పాటు రూ.75వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. 3,57,844 మందికి రూ.536.77 కోట్లు జమ చేస్తున్నాం. లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. కాపు నేస్తంతో 4లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్దిచేకూరింది. 45 నుంచి 60 ఏళ్ల అక్క చెలమ్మలకు అండగా నిలిచాం అన్నారు.
పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా..ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తూ వరుసగా నాలుగో ఏడాదీ ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా నగదు జమ చేశారు. అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లయ్యింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 52 నెలల్లో 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు డీబీటీ, నాన్–డీబీటీతో రూ.39,247 కోట్ల మేర లబ్ధి చేకూర్చడం గమనార్హం. కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనగా అంతకంటే మిన్నగా మేలు చేసింది.
