వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) దూకుడు మీద ఉంది. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు నియోజకవర్గాలలో భారీ ఎత్తున సభలను నిర్వహించి ఎన్నికలకు సర్వసన్నద్ధమవుతుంటే, విపక్షాలేమో ఇంకా పొత్తు ప్రయత్నాలలో ఉన్నాయి. ఇక ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలోని(Adnaki Constituency) మేదరమెట్లలో మరో బహిరంగసభకు(Public meeting) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) దూకుడు మీద ఉంది. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు నియోజకవర్గాలలో భారీ ఎత్తున సభలను నిర్వహించి ఎన్నికలకు సర్వసన్నద్ధమవుతుంటే, విపక్షాలేమో ఇంకా పొత్తు ప్రయత్నాలలో ఉన్నాయి. ఇక ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలోని(Adnaki Constituency) మేదరమెట్లలో మరో బహిరంగసభకు(Public meeting) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ క్యాడర్‌ను ఎన్నికల సమరాంగణానికి సన్నద్ధం చేయడం కోసం నిర్వహిస్తున్న సిద్ధం సభకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సుమారు 15 లక్షల మంది సభకు హాజరు కావచ్చని అనుకుంటున్నారు. ఎక్కువ మంది చూసేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు(LED Screens) కూడా అమర్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan reddy) కార్యకర్తలకు మరింత చేరువ కావడానికి వీలుగా ర్యాంప్‌లు ఏర్పాటుచేశారు. ఇదే సభలో ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో(Manifesto) కొన్ని అంశాలను విడుదల చేసే అవకాశం ఉంది. వరుస సిద్ధం సభలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతుంటే ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం, జనసేన ఇప్పటి వరకు ఒక్క సభను కూడా నిర్వహించలేకపోయాయి. మెదరమెట్ల సిద్ధం సభ తర్వాత ప్రజలలో ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న ఆదరణ మరోమారు తెలుస్తుంది . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారనే పాజిటివ్‌ టాక్‌ కూడా మొదలయ్యింది.

Updated On 9 March 2024 6:04 AM GMT
Ehatv

Ehatv

Next Story