ఏపీ రాజకీయాల్లో(AP Politics) షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు సంచనంగా మారాయి. కాంగ్రెస్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ప్రసంగంలోనే షర్మిల.. తన అన్నను, వైసీపీని, టీడీపీపై విమర్శలు చేశారు. అయితే సీఎం జగన్‌(CM Jagan) పట్ల ఆమె మాట్లాడిన తీరును వైసీపీ(YCP) నేతలు తప్పుపడుతున్నారు. ఏపీ విభజన జరిగినప్పుడు లక్ష కోట్ల అప్పు ఉందన్న షర్మిల, ఇప్పుడు 10 లక్షల కోట్లయిందని.. జగన్‌రెడ్డి మూడు లక్షల కోట్లు అప్పు చేశాడని ఆమె విమర్శించారు.

ఏపీ రాజకీయాల్లో(AP Politics) షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు సంచనంగా మారాయి. కాంగ్రెస్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ప్రసంగంలోనే షర్మిల.. తన అన్నను, వైసీపీని, టీడీపీపై విమర్శలు చేశారు. అయితే సీఎం జగన్‌(CM Jagan) పట్ల ఆమె మాట్లాడిన తీరును వైసీపీ(YCP) నేతలు తప్పుపడుతున్నారు. ఏపీ విభజన జరిగినప్పుడు లక్ష కోట్ల అప్పు ఉందన్న షర్మిల, ఇప్పుడు 10 లక్షల కోట్లయిందని.. జగన్‌రెడ్డి మూడు లక్షల కోట్లు అప్పు చేశాడని ఆమె విమర్శించారు. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మధ్యలో చంద్రబాబు చేసిన అప్పు గురించి ఎందుకు మాట్లాడలేదని.. అంతేస్థాయిలో చంద్రబాబును ఎందుకు విమర్శించలేదని అంటున్నారు.

పైగా షర్మిల వ్యాఖ్యలకు ఒక్క టీడీపీ(TDP) నేత కూడా కౌంటర్ ఇవ్వకపోవడంతో తమ వ్యాఖ్యలకు బలం చేకూరిందని వైసీపీ నేతలు(YCP Leaders) వాదిస్తున్నారు. జగన్‌ను అధికారంలోకి దించేందుకు షర్మిలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అంతేకాకుండా మణిపూర్‌ క్రైస్తవులపై దాడులను, జగన్‌తో ముడిపెట్టారు. ఒక క్రైస్తవుడిగా ఉన్న జగన్‌.. మణిపూర్‌ హింసపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె విమర్శలు చేశారు. దీనిపై కూడా వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్‌ ఇస్తున్నారు. క్రిస్టియన్లు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్‌గా ఉన్నాయని.. ఇప్పుడు క్రిస్టియన్ల ఓటు బ్యాంకును దూరం చేసి జగన్‌ను అధికారంలో నుంచి దూరంచేయాలని చంద్రబాబు, షర్మిల ప్లాన్‌ వేశారని వైసీపీ నేతలు షర్మిలపై విరుచుకుపడుతున్నారు.

మరోవైపు జగన్‌ను పవన్‌ కల్యాణ్‌ మాదిరిలా జగన్‌ రెడ్గి అంటూ సంభోదించారు. జగన్‌రెడ్డి.. జగన్‌రెడ్డి అంటూ పలుసార్లు వెటకారంగా మాట్లాడరని వైసీపీ అంటోంది. ఇదే విషయాన్ని షర్మిలతో మీడియా ప్రస్తావించగా.. జగన్‌ రెడ్డి గారు.. అంటే తప్పా అని ఆమె ఎదురు ప్రశ్నించారు. వైఎస్ కూతురిగా, జగన్‌ చెల్లిలిగా ఉన్నందున తాను ఏది మాట్లాడినా మీడియా అటెన్షన్‌ను డైవర్ట్‌ చేయొచ్చని షర్మిల అనుకుంటోందని వైసీపీ నేతలు అంటున్నారు. పైగా జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే, ఆయన వ్యతిరేక మీడియా దానిని ఫోకస్‌ చేసేందుకు కాచుకుకుర్చున్నారని.. దాంతో జగన్‌ వ్యతిరేక వర్గీయుల నుంచి ఆమె లబ్ధిపొందాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. తెలంగాణతోనే నా చావైనా.. రేవైనా అని చెప్పిన షర్మిల ఇప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. అన్నపై ఉన్న వ్యక్తిగత కక్షతో జగన్‌ ప్రత్యర్థులతో చేతులు కలిపారంటున్నారు. షర్మిల ఇప్పుడు చంద్రబాబు చెప్పు చేతల్లో ఉన్నారని.. చంద్రబాబు వదిలిన బాణమే షర్మిల అని వైసీపీ విమర్శిస్తోంది.

Updated On 22 Jan 2024 7:04 AM GMT
Ehatv

Ehatv

Next Story