వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తాజా ప‌రిణామాల‌పై స్పందించారు. నేను అప్రూవర్ గా మారినప్పుడు ఇప్పుడు విమర్శించేవారు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేద‌ని ప్ర‌శ్నించారు. మీ వరకు రానంతవరకు దస్తగిరి మంచోడు.. ఇప్పుడు చెడ్డోడిగా మారాడా.? అని ప్ర‌శ్నించారు. నిజం ఒప్పుకోవడం నేను చేసిన తప్పా.? మీరు చేయమంటేనే ఆ పని చేశాను. నా జీవితం బాగుపడుతుంది అని మీరు చెప్పడంతో చేశానని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మీ అరెస్టులు వచ్చే అంతవరకు ఇలాంటివి […]

వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తాజా ప‌రిణామాల‌పై స్పందించారు. నేను అప్రూవర్ గా మారినప్పుడు ఇప్పుడు విమర్శించేవారు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేద‌ని ప్ర‌శ్నించారు. మీ వరకు రానంతవరకు దస్తగిరి మంచోడు.. ఇప్పుడు చెడ్డోడిగా మారాడా.? అని ప్ర‌శ్నించారు. నిజం ఒప్పుకోవడం నేను చేసిన తప్పా.? మీరు చేయమంటేనే ఆ పని చేశాను. నా జీవితం బాగుపడుతుంది అని మీరు చెప్పడంతో చేశానని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మీ అరెస్టులు వచ్చే అంతవరకు ఇలాంటివి మీకు గుర్తు రాలేదా అని ప్ర‌శ్నించారు.

సునీతమ్మ, సీబీఐ వద్ద ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదని స్ప‌ష్టత ఇచ్చారు. డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే జీవితాంతం నేను జైలుకు వెళ్లడానికి సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. సునీతమ్మ వద్ద డబ్బులు తీసుకున్నానని ఆరోపణ చేసేవారు ఏ అకౌంట్ నుండి డబ్బులు వేశారో కనుక్కోలేరా.. వాటిని కోర్టుకు చూపించలేరా ప్ర‌శ్నించారు. నేను డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే జీవితాంతం నేను జైల్లో ఉంటాను. ఒకవేళ మీరు నిరూపించలేకపోతే మీ ఎంపీ పదవులకు, మీ పార్టీ పదవులకు మీరు రాజీనామా చేస్తారా? అని ప్ర‌శ్నించారు.

Updated On 17 April 2023 8:54 AM GMT
Yagnik

Yagnik

Next Story