కడప(Kadapa) జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) కంచుకోట! అక్కడ్నుంచి ప్రత్యర్థులు విజయం సాధించడం అసాధ్యమని అంటుంటారు. జగన్‌కు(Jagan) బలమున్న ఆ జిల్లాలో పాగా వేయడానికి తెలుగుదేశంపార్టీ పావులు కదుపుతోందట! ఓ పక్క కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి జగన్‌ వ్యూహరచన చేస్తుంటే, మరో పక్క కడప జిల్లాను పసుపుమయం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారట! అలాగని సాక్షి పత్రిక రాసుకొచ్చింది.

కడప(Kadapa) జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) కంచుకోట! అక్కడ్నుంచి ప్రత్యర్థులు విజయం సాధించడం అసాధ్యమని అంటుంటారు. జగన్‌కు(Jagan) బలమున్న ఆ జిల్లాలో పాగా వేయడానికి తెలుగుదేశంపార్టీ పావులు కదుపుతోందట! ఓ పక్క కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి జగన్‌ వ్యూహరచన చేస్తుంటే, మరో పక్క కడప జిల్లాను పసుపుమయం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారట! అలాగని సాక్షి పత్రిక రాసుకొచ్చింది. దివంగత వై.ఎస్‌.వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) భార్య సౌభాగ్యమ్మను(Soubhagyamma) ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా(Independent) కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నారట! స్వతంత్ర అభ్యర్థిగా సౌభాగ్యమని నిలబ్టెటి బయట నుంచి సపోర్ట్ చేయాలన్నది టీడీపీ అధినేత వ్యూహం. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతు ఇవ్వడానికి వెనుకాడదన్నది చంద్రబాబు ఆలోచన అని సాక్షి రాసింది. కాంగ్రెస్‌ తరఫున డాక్టర్‌ సునీత పోటీ చేయాలని ముందు అనుకున్నప్పటికీ ఎక్కడ బీజేపీకి కోపం వస్తుందోనని వెనక్కి తగ్గారన్నది సాక్షి కథనం. వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులందరిని జైలుకు పంపడంలో వివేకా కుటుంబసభ్యులు విజయం సాధించారనే చెప్పాలి. ఇప్పుడు వారి లక్ష్యమల్లా కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిని కటకటాల వెనక్కి పంపించాలన్నదే! ఇందులో మాత్రం సునీతమ్మ విఫలం చెందారు. ఇక వారికి మిగిలిన ఆప్షన్ ప్రజా కోర్టే! అందుకే కడప్‌ లోక్‌సభ ఎన్నికల్లో అవినాష్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలనే భావనకు వచ్చేశారు. ఇందుకోసం ఇప్పుడు వై.ఎస్‌.షర్మిల కూడా వారికి తోడయ్యారు. వివేకానందరెడ్డి కుటుంబసభ్యులకు మొదట మద్దతు ఇవ్వని షర్మిల ఇప్పుడు అవసరార్థం సునీతమ్మను దగ్గర తీసుకున్నారు. సౌభాగ్యమ్మను ఇండిపెడెంట్‌గా నిలబెట్టడం వల్ల కుటుంబసభ్యులు పోటీ చేసినా జగన్‌ మద్దతు ఇవ్వడం లేదనే నిందను ఆయనపై నెట్టివేయవచ్చు. రాష్ట్రమంతటా ఈ విషయాన్ని దుష్ర్పచారం చేయనూ వచ్చు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమింటే ఒకవేళ సౌభాగ్యమ్మ ఇండిపెండెంట్‌ పోటీ చేస్తే మాత్రం అవినాష్‌కు కష్టమే! ఎందుకంటే కడపలో వైఎస్‌ వివేకానందరెడ్డి ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కడప జిల్లాకు సంబంధించిన పనులన్నీ వివేకానందరెడ్డినే చూసుకునేవారు. ఇప్పుడా లోటు కనిపిస్తుందని కొందరు అంటున్నారు. మొత్తంమీద కడపలో కుటుంబపోరు రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి.

Updated On 2 Feb 2024 2:07 AM GMT
Ehatv

Ehatv

Next Story