Dastagiri : వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్.. సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి మంగళవారం సీబీఐ కోర్టును ఆశ్రయించాడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి(Dastagiri) మంగళవారం సీబీఐ కోర్టు(CBI Court)ను ఆశ్రయించాడు. వివేకా హత్య కేసులో తనను నిందితుడిగా తొలగించాలని సీబీఐ కోర్టులో పిటిషన్(Petition) దాఖలు చేశాడు. తనను కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని పిటీషన్‌లో కోరాడు. గతంలో సీబీఐ చార్జిషీట్(Chargesheet) లో తనను సాక్షిగా చేర్చిందని దస్తగిరి వివరించాడు. దస్తగిరి పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు బుధవారం విచారించనుంది. వివేకా హత్య కేసులో దస్తగిరి ఏ-4గా ఉన్నాడు. అయితే అప్రూవర్ గా మారిన అనంతరం అతడికి బెయిల్ లభించింది.
ఇదిలావుంటే.. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy)కి సీబీఐ కోర్టు కొద్దిరోజుల కిందటే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 30 వరకూ బెయిల్(Bail) మంజూరు చేసింది న్యాయస్థానం. డిసెంబర్ 1న 10.30 గంటలకు చంచల్‌గూడ్ జైలు(Chanchalguda Jail)లో లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టులో తన పాస్‌పోర్టు(Passport)ను సరెండర్ చేయాలని కూడా భాస్కర్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. చికిత్సకు వెళ్లాల్సి వస్తే ఆ వివరాలను కూడా సీబీఐ(CBI)కి తెలపాలని స్పష్టం చేసింది. కుటుంబసభ్యులను తప్ప మిగతా ఎవ్వరినీ కలవొద్దని కూడా భాస్కర్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 20న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు కాగా.. ఆ బెయిల్‌ను ఇంటరిమ్ బెయిల్‌గా మారుస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.