ఇడుపులపాయలో వైఎస్ షర్మిలను(YS Sharmila) వివేకా కూతరు సునీత(Sunitha) కలుసుకోవడంపై రాజకీయ చర్చ జరుగుతోంది. ఏపీపీసీసీ(APCC) పగ్గాలు చేపట్టాక వైసీపీ(YCP) ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఇడుపుల‌పాయ‌లో(Idupulapaya) దివంగ‌త వైఎస్ ఘాట్(YS Ghat) సాక్షిగా ష‌ర్మిల‌తో సునీత భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. త‌న తండ్రి వివేకా హంత‌కుల‌ను శిక్షించాల‌ని ఐదేళ్లుగా సునీత న్యాయపోరాటం చేస్తున్నారు.

ఇడుపులపాయలో వైఎస్ షర్మిలను(YS Sharmila) వివేకా కూతరు సునీత(Sunitha) కలుసుకోవడంపై రాజకీయ చర్చ జరుగుతోంది. ఏపీపీసీసీ(APCC) పగ్గాలు చేపట్టాక వైసీపీ(YCP) ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఇడుపుల‌పాయ‌లో(Idupulapaya) దివంగ‌త వైఎస్ ఘాట్(YS Ghat) సాక్షిగా ష‌ర్మిల‌తో సునీత భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. త‌న తండ్రి వివేకా హంత‌కుల‌ను శిక్షించాల‌ని ఐదేళ్లుగా సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. కానీ..ఈ ఐదేళ్లలో షర్మిల ఏనాడు సునీతను కలుసుకొని పరామర్శించిన దాఖలాలు లేవు. ఆమె చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతు తెలిపిందీ లేదు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యత‌లు చేప‌ట్టిన తర్వాత సునీత గుర్తుకు రావ‌డం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే..సునీతను షర్మిల కవలడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అన్న జగన్‎ని(CM Jagan) రాజకీయంగా ఇరుకున పెట్టేందుకే సునీతను తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది.

కడప ఎంపీగా(Kadapa MP) సునీతను పోటీ చేయించే ఆలోచనలో షర్మిల ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగానే సునీతో షర్మిల సమావేశం అయ్యారన్న చర్చ జరుగుతోంది. అయితే సునీత టీడీపీలో(TDP) చేరి, క‌డ‌ప లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తార‌నే ప్రచారం అప్పట్లో ముమ్మరంగా జ‌రిగింది. అయితే రాజ‌కీయాల్లోకి రావ‌డానికి సునీత ఆస‌క్తిగా లేర‌ని తెలిసింది. కానీ..తాజాగా ష‌ర్మిల‌, సునీత తో మూడుగంటలపాటు సమావేశం కావడం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌నే చ‌ర్చకు తెర‌లేచింది. తండ్రి వివేకాను(YS Vivekanada Reddy) కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సునీత ఏనాడు జ‌గ‌న్‌పై బ‌హిరంగ విమ‌ర్శలు చేయ‌లేదు. త‌న తండ్రిని చంపిన నిందితుల్లో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్కర్‌రెడ్డి పాత్రల గురించి కోర్టుల‌కు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్లలో మాత్రమే పొందుప‌రిచారు. అంత‌కు మించి ఆమె ఇప్పటి వరకు మీడియా ముందుకొచ్చి, వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌లేదు. మరి..వైఎస్ ష‌ర్మిల చేస్తున్న ప్రయ‌త్నాల‌కు సునీత సహకరిస్తారా? లేదా అనేదానిపై కడపజిల్లా రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జ‌రుగుతోంది.

Updated On 29 Jan 2024 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story