YS Sunitha Reddy : కాంగ్రెస్ పార్టీలోకి సునీత
దివంగత మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి(YS Vivekanand Reddy) కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి(Dr. Narreddy Sunitha Reddy) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు.
దివంగత మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి(YS Vivekanand Reddy) కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి(Dr. Narreddy Sunitha Reddy) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరబోతున్నారు. షర్మిలకు(YS Sharmila) ఏపీ పీసీసీ(AP PCC) పగ్గాలు అందిన సమయంలోనే సునీత కూడా కాంగ్రెస్‌లో చేరాలనుకోవడం రాజకీయవర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. వివేకానందరెడ్డి హత్య తర్వాత సునీతరెడ్డి యాక్టివ్ అయ్యారు. వివేకా హత్య కేసులో సీబీఐకి(CBI) కీలకమైన సమాచారం ఇచ్చారు. కోర్టుల్లో ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత రాబోతున్నారు. అంతే కాదు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కడప లోక్‌సభ స్థానం నుంచి కానీ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ పోటీ చేయాలని సునీత అనుకుంటున్నారట!