వైఎస్ వివేకా ను గొడ్డలితో నరికి చంపారని  వైఎస్ షర్మిల రెడ్డి ఏపిసిసి చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి అన్నారు . కడప లో జరిగిన పాదయాత్ర లో బాగంగా ఆమె మాట్లాడారు. 

వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి చంపారని.. 5 ఏళ్లు గడించింది.. అయినా శిక్ష పడలేదని వైఎస్ ష‌ర్మిల అన్నారు. 5 ఏళ్లు దాటినా శిక్ష పడలేదు అంటే ఈ ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ? అని ప్ర‌శ్నించారు. వివేకా హత్య విషయంలో CBI దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఎవరు చేయించారో అందరికీ తెలుసు.. అయినా నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు. ఇది న్యాయమేనా ? ధర్మమేనా.? సొంత బాబాయిని చంపిన వాళ్ళను శిక్షించని నువ్వు నాయకుడు ఎలా అవుతావు.? అని ప్ర‌శ్నించారు.

అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నావ్ ? ఎక్కడుంది న్యాయం ? ఎక్కడుంది ధర్మం ? హత్య చేసిన వాళ్ళకే మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు. ఈ ఘోరాన్ని ఆపడానికే వైఎస్సార్ బిడ్డ ఎంపీగా నిలబడిందని స్ప‌ష్టం చేశారు. ఇది న్యాయానికి, అధర్మానికి జరుగుతున్న పోరాటం.. ఇందులో గెలుపు ఎవరిదో యావత్ ప్రపంచం చూస్తుందన్నారు. గెలిపిస్తే అందుబాటులో ఉంట.. పిలిస్తే పలుకుతూ.. మీ బంధువు అవుతా.. మీ సమస్యలను నేను బుజాన వేసుకుంటా.. వైఎస్సార్ లెక్క సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాన‌న్నారు.

Updated On 5 April 2024 9:40 PM GMT
Yagnik

Yagnik

Next Story