మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి(Y.S Vivekananda Reddy) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్‌ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు నాంపల్లి(nampally) సీబీఐ కోర్టు(CBI Court) ప్రకటించింది. సుప్రీంకోర్టు కూడా జూన్‌ 30వ తేదీ వరకు విచారణకు గడువు పెంచుతూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి(Y.S Vivekananda Reddy) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్‌ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు నాంపల్లి(nampally) సీబీఐ కోర్టు(CBI Court) ప్రకటించింది. సుప్రీంకోర్టు కూడా జూన్‌ 30వ తేదీ వరకు విచారణకు గడువు పెంచుతూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు కూడా వివేకా హత్య కేసు(Murder case) విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలాఉంటే ఈ కేసుకు సంబంధించిన నిందితులను సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసులో ఎ-1(Accused-1) నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి(Erra Gangi redy) కూడా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. గంగిరెడ్డితో పాటు దేవిరెడ్డి(devi reddy), శివశంకర్‌రెడ్డి(shiva shankar Reddy), ఉమాశంకర్‌రెడ్డి(Uma shankar Reddy), సునీల్‌ యాదవ్‌లను(sunil Yadav) సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ(Telangana) హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే! గంగిరెడ్డి బయట ఉంటే దర్యాప్తులో సహకరించడానికి ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదని హైకోర్టుకు సీబీఐ తెలిపింది.

విచారణ కీలక దశలో ఉన్నప్పుడు అతడి బెయిల్‌ రద్దు చేయాలని హైకోర్టుకు వివరించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు మే 5వ తేదీలోపు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ అతడు సీబీఐ కోర్టులో లొంగిపోకపోతే అరెస్ట్‌ చేయవచ్చని తెలిపింది. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు గంగిరెడ్డి బెయిల్ రద్దు అమలులో ఉంటుందని, కావాలనుకుంటే సీబీఐ దర్యాప్తు గడువు తేదీ జూన్‌ 30 తర్వాత గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వవచ్చని ట్రయల్ కోర్టుకు తెలంగాణ హైకోర్టు తెలిపింది.

Updated On 28 April 2023 2:20 AM GMT
Ehatv

Ehatv

Next Story