Priya Atluri : షర్మిలకు కాబోయే కోడలితో విజయమ్మ.!
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫ్యామిలీకి సంబంధించి మరో విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది పొలిటికల్ మ్యాటర్ కాదు.. అందుకే ఈవార్త మరింత వైరల్ అవుతోంది
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఫ్యామిలీకి సంబంధించి మరో విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది పొలిటికల్ మ్యాటర్ కాదు.. అందుకే ఈవార్త మరింత వైరల్ అవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy), విజయమ్మ(YS Vijayamma)ల కూతురు, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఇంట్లో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయనేది ఈ వైరల్ వార్తల యొక్క సందేశం. షర్మిల-అనిల్(Anil) దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డి(YS Rajareddy) పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రాజారెడ్డి ప్రకటించారు.
ఈ క్రమంలోనే రాజారెడ్డి పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగతున్నాయి. వైఎస్ షర్మిల కాబోయే కోడలు పేరు ప్రియా అట్లూరి(Priya Atluri). తాజాగా రాజారెడ్డి అమ్మమ్మ వైఎస్ విజయమ్మ.. ప్రియాతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాజారెడ్డి ప్రేమ వ్యవహారం చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఆయన గర్ల్ ఫ్రెండ్ తన అమ్మమ్మతో దిగిన ఫోటోలు చూస్తుంటే రెండు ఫ్యామిలీలు ఎంతో కలిసిపోయినట్లుగా కనిపిస్తోంది. ప్రియా కమ్మ సామాజిక వర్గానికి చెందిన యువతి. ప్రియా అట్లూరి అమెరికా(America)లో స్థిరపడ్డారు. యూఎస్ సిటిజెన్‌షిప్ కూడా ఉంది. మరి వీరి పెళ్లికి షర్మిల అన్న, రాజారెడ్డి మామ అయిన ఏపీ సీఎం జగన్(CM Jagan) హాజరవుతారా లేదా అనే విషయమై సస్పెన్స్ నెలకొంది.