YS Jagan Mohan Reddy : కొడుకు వెంటే తల్లి.. జగన్‌కు విజయాశీస్సులు అందించిన విజయమ్మ!
ఆంధప్రదేశ్‌లో(Aadhra Pradesh) వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan Mohan Reddy) అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు ఆయనకు ప్రతికూలంగా ఉన్న అంశాలన్నీ ఒక్కొక్కటిగా అనుకూలంగా మారుతున్నాయి. అన్నింటికంటే కీలకమైనదేమిటంటే తల్లి విజయమ్మ(Vijayamma) కొడుకు వెంట ఉండటం! ఏ కొడుకుకైనా ఇంతకంటే కావాల్సిందేముంటుంది? తల్లి చెంత ఉంటే పది చేతులతో దుర్గాదేవి కాపాడుతున్న అనుభూతి కలగకుండా ఎలా ఉంటుంది? బుధవారం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు.
ఆంధప్రదేశ్‌లో(Aadhra Pradesh) వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan Mohan Reddy) అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు ఆయనకు ప్రతికూలంగా ఉన్న అంశాలన్నీ ఒక్కొక్కటిగా అనుకూలంగా మారుతున్నాయి. అన్నింటికంటే కీలకమైనదేమిటంటే తల్లి విజయమ్మ(Vijayamma) కొడుకు వెంట ఉండటం! ఏ కొడుకుకైనా ఇంతకంటే కావాల్సిందేముంటుంది? తల్లి చెంత ఉంటే పది చేతులతో దుర్గాదేవి కాపాడుతున్న అనుభూతి కలగకుండా ఎలా ఉంటుంది? బుధవారం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. అంతకు ముందు ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్‌ఆర్ ఘాట్(YSR Ghat) దగ్గర తండ్రి రాజశేఖర్‌రెడ్డికి(Rajashekar reddy) నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ వెంట వైఎస్ విజయమ్మ కూడా పాల్గొనడం చాలా మందికి ఆశ్చర్యాన్ని, వైసీపీ క్యాడర్‌కు ఆనందాన్ని కలిగించింది. ఆమె ఇడుపులపాయకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ఆమె వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఇంతకు ముందు ఉన్నారు. అయితే ఎప్పుడైతే కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారో అప్పుడు ఆమె గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి కూతురు వెంట నడిచారు. అప్పుడు టీడీపీ అనుకూల మీడియా సంబరంతో అనేక పలుకులు రాసింది. చివరాఖరికి జగన్ తల్లిని కూడా దూరం పెట్టారంటూ నానా చెత్త రాసింది. ఆ మీడియా రాతల ప్రభావంతో కొందరు అది నిజమే కాబోలనుకున్నారు. కూతురు వెంటనే విజయమ్మ నడుస్తారని భావించారు. తెలంగాణలో షర్మిల పార్టీ అయితే పెట్టారు కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనుకంజ వేశారు. గెలవడం మాట అటుంచితే కనీసం డిపాజిట్లు కూడా రావని అర్థమవ్వడంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. ఆ విధంగా ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌గాంధీ(Rahul gandhi), ప్రియాంకగాంధీలను(Priyanka gandhi) కలిశారు. కర్ణాటకకు వెళ్లి డికే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. చివరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇందుకు కృతజ్క్షతగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ పోస్టు కట్టబెట్టింది కాంగ్రెస్.. ఇకనేం జగన్‌కు తల్లి కూతుళ్లు కలిసి చుక్కలు చూపించడం ఖాయమని టీడీపీ కంటే ఆ పార్టీ అనుకూల మీడియానే చంకలు గుద్దుకుంది. షర్మిల సభలకు ప్రియారిటీని ఇస్తూ తృప్తి పడింది. ఏపీలో అన్నాచెల్లెళ్లు అయిన జగన్, షర్మిలలు వేరు వేరు పార్టీలలో ఉండటంతో తల్లి విజయమ్మ ఎటు వైపు ఉంటారన్నది ప్రశ్నగా మారింది. ఎవరికి మద్దతు తెలుపుతారన్న ఉత్కంఠ పార్టీ నేతల్లోనూ, ప్రజల్లోనూ నెలకొని ఉండింది. బుధవారంతో సందేహాలన్నీ తీరిపోయాయి. ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ హాజరు కావడంతో ఆమె మద్దతు జగన్ కే ఉందని తేలిపోయింది. ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న జగన్‌కు విజయమ్మ ఆశీర్వాదం అందించారు. విజయోస్తూ అని దీవించారు.