కొన్నాళ్ల పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వై.ఎస్‌.విజయమ్మ(YS Viajyamma) కూతురు షర్మిల(Sharmila) కోసం ఆ పదవి వదులుకున్నారు. తెలంగాణలో షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పెట్టడంతో విజయమ్మ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌర అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు. కూతురు పెట్టిన పార్టీకి గౌరవ అధ్యక్షురాలయ్యారు. ఏపీని వదిలేసి కూతురు కోసం తెలంగాణకు వచ్చారు. జగన్మోహన్‌రెడ్డి సొంతంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని పెట్టినప్పుడు ఆయనకు అండగా నిలిచామని, జగన్‌ అధికారంలోకి వచ్చి అనేక అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు కనుక ఇక తన అవసరం లేదనుకున్నానని విజయమ్మ చెప్పుకొచ్చారు.

కొన్నాళ్ల పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వై.ఎస్‌.విజయమ్మ(YS Viajyamma) కూతురు షర్మిల(Sharmila) కోసం ఆ పదవి వదులుకున్నారు. తెలంగాణలో షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పెట్టడంతో విజయమ్మ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌర అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు. కూతురు పెట్టిన పార్టీకి గౌరవ అధ్యక్షురాలయ్యారు. ఏపీని వదిలేసి కూతురు కోసం తెలంగాణకు వచ్చారు. జగన్మోహన్‌రెడ్డి సొంతంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని పెట్టినప్పుడు ఆయనకు అండగా నిలిచామని, జగన్‌ అధికారంలోకి వచ్చి అనేక అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు కనుక ఇక తన అవసరం లేదనుకున్నానని విజయమ్మ చెప్పుకొచ్చారు. తెలంగాణలో వైఎస్‌ పాలన కోసం షర్మిల పార్టీ పెట్టారని, ఇప్పుడు తన అవసరం ఆమెకు ఎంతో ఉందని చెబుతూ విజయమ్మ తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నించింది. కాంగ్రెస్‌ పొత్తుపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించారు షర్మిల. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. చెప్పిన 24 గంటలకే మాటమార్చరు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నానని ప్రకటించారు. దీనికి కూడా కాంగ్రెస్‌ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేశారు. ఇప్పుడు తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు చీఫ్‌ అయ్యారు. షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్టయ్యారు. కూతురు ఏపీకి వచ్చి ఓ పార్టీకి చీఫ్‌ అయినప్పటికీ విజయమ్మ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్‌ రాలేదు. ప్రస్తుతం ఏపీలో అన్నా చెల్లెళ్లిద్దరి మధ్య పోరు నడుస్తోంది. జగన్(Jagan) ఏమీ అనకపోయినా షర్మిల మాత్రం అన్నపై విమర్శలు చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. ఉభయులు అనివార్యంగా విజయమ్మ పేరును ప్రస్తావిస్తున్నారు. జగన్‌ తమకు అన్యాయం చేశారని, తమ కుటుంబాన్ని చీల్చారని షర్మిల అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తన కుటుంబాన్ని చీల్చిందని జగన్‌ ప్రతి విమర్శ చేశారు. జగన్‌ తనపై ఆరోపణలు చేసినప్పుడల్లా అవన్నీ అసత్యాలని, కావాలంటే విజయమ్మను అడిగి తెలుసుకోండని షర్మిల చెబుతున్నారు. ఇలా ఇద్దరూ విజయమ్మ పేరును ప్రస్తావిస్తున్నారు. మరి విజయమ్మ దీనికి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఆమె మౌనం వెనుక కారణమేమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం!

Updated On 27 Jan 2024 5:11 AM GMT
Ehatv

Ehatv

Next Story