YS Vijayalakshmi: వైఎస్ విజయలక్ష్మి ఎక్కడ ఉన్నారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జగన్, షర్మిల ఇద్దరూ హోరాహోరీగా తలపడడం

ఆంధ్రప్రదేశ్‌లో జగన్, షర్మిల ఇద్దరూ హోరాహోరీగా తలపడడం
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకోడానికి ఆయన కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాల్లో భాగమయ్యారు. ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి పలు ప్రాంతాల్లో పర్యటనలు కూడా చేపట్టారు. అయితే 2024 ఎన్నికల సమయంలో మాత్రం ఆమె ఇక్కడ లేరు. కొడుకు-కుమార్తె ఇద్దరూ వేర్వేరు పార్టీలలో ఉండడంతో వైఎస్ విజయ లక్ష్మి ఏపీని వీడారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్, షర్మిల ఇద్దరూ హోరాహోరీగా తలపడడం వల్లే ఎన్నికల ప్రచారం ప్రారంభం కావడానికి ముందే వైఎస్ విజయలక్ష్మి అమెరికాకు వెళ్లిపోయారు. షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డితో పాటు వైఎస్ మహిళ కొత్త ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో ప్రియా అట్లూరి, షర్మిల కూతురు అంజలి కూడా కనిపిస్తారు. కడప నుంచి షర్మిల నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా విజయలక్ష్మి ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
