YS Viveka Murder Case : అవినాశ్ మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకు వెళ్లిన సునీత
వివేకానందరెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy Murder Case)లో ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy) మధ్యంతర బెయిల్‌కు వ్యతిరేకంగా వివేకా కూతురు వైఎస్ సునీత(YS Sunitha) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. సీజేఐ ధర్మాసనం ముందు సునీత పిటిషన్‌ను సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లూద్రా ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను రేపు విచారణకు స్వీకరిస్తామని సీజేఐ తెలిపారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 తేదీ వరకు అరెస్ట్
వివేకానందరెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy Murder Case)లో ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy) మధ్యంతర బెయిల్‌కు వ్యతిరేకంగా వివేకా కూతురు వైఎస్ సునీత(YS Sunitha) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. సీజేఐ ధర్మాసనం ముందు సునీత పిటిషన్‌ను సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లూద్రా ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను రేపు విచారణకు స్వీకరిస్తామని సీజేఐ తెలిపారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకో(Telangana High Court)ర్టు సీబీఐ(CBI)ని ఆదేశించిన నేపథ్యంలో సునీత్ సుప్రీం తలుపుతట్టారు. 'ఈ నెల 25వ తేదీ వరకు ప్రతిరోజూ సీబీఐ ఎదుట అవినాశ్‌రెడ్డి హాజరుకావాలి. విచారణకు సహకరించాలి. సీబీఐ అధికారులు ప్రశ్నలను లిఖితపూర్వకంగా అందజేయాలి. అవినాశ్ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. విచారణకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలి' అని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. దీనిపైనే సునీత సుప్రీంకు వెళ్లారు..