YS Sunitha Joins In TDP : టీడీపీలోకి సునీత రెడ్డి.. జగన్పై పోటీ..?
వివేకా(Viveka) హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుంది... ప్రస్తుత్తం ఈ కేసును తెలంగాణ సిబిఐ(Telangana CBI) విచారిస్తుంది.. వివేకా హత్యకు టీడీపీనే(TDP) కారణమని అప్పట్లో విమర్శలు వచ్చాయి, కానీ కుటుంబ సభ్యుల సహకారంతోనే వివేకాను చంపారని ప్రాథమిక విచారణలో తేలింది..

ys sunitha in tdp
వివేకా(Viveka) హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుంది... ప్రస్తుత్తం ఈ కేసును తెలంగాణ సిబిఐ(Telangana CBI) విచారిస్తుంది.. వివేకా హత్యకు టీడీపీనే(TDP) కారణమని అప్పట్లో విమర్శలు వచ్చాయి, కానీ కుటుంబ సభ్యుల సహకారంతోనే వివేకాను చంపారని ప్రాథమిక విచారణలో తేలింది.. ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి(Erra Gangi reddy), వైసీపీ(YCP) ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash reddy), అయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్రవుందని తెలిపిన సిబిఐ విచారణను కొనసాగిస్తోంది.
వివేకా హత్య జరిగిన దగ్గర నుంచి వైయస్ కుటుంబంపై అసహం వ్యక్తంచేస్తుంది అయన కుమార్తె సునీత(Sunitha).. సొంత అన్న జగన్(Jagan) ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండికూడా ఈ కేసుపై సరైన
విచారణ జరగకపోవడంపై ఆమె అనేక సార్లు అసహనం వ్యక్తం చేశారు.. అయితే ఈ కేసును అందరూ రాజకీయ కోణంలో చూస్తున్నారు.. సునీత అసహనాన్ని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది.. వివేకా హత్యపై సునీతకు మద్దతు తెలుపుతూ ఎప్పటికప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు చంద్రబాబు.
రాబోయే ఎన్నికలను అన్ని పార్టీలు కీలకంగా తీసుకున్నాయి.. జగన్ "టార్గెట్ 175 " అంటే, బాబు మాత్రం "వై నాట్ పులివెందుల " అనే స్లోగన్ తో దూసుకుపోతున్నారు... ఇప్పుడు ఇదే స్లోగన్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది.. అన్నపై అసహనంగా ఉన్న సునీతను టీడీపీలో చేర్చుకొని.. పులివెందులలో జగన్ పై పోటీ చేయించాలని చంద్రబాబు చూస్తున్నారట.. అంతే కాదు దీనిపై కొంత మంది నేతలు పలుమార్లు సునీతతో చర్చించినట్లు కూడా తెలుస్తుంది.. మరి కోద్ది రోజుల్లో వివేకా కేసు అసలు నిందితులను సిబిఐ ప్రకటించే అవకాశం ఉంది.. ఇందులో వైయస్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని తెలిస్తే మాత్రం ఆమె కచ్చితంగా టీడీపీలో చేరి వారిపై పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
