వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) అధినేత్రి వై.ఎస్‌.షర్మిలకు(YS sharmila) ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఆమె వేస్తున్న ఏ అడుగు కూడా సరిగ్గా పడటం లేదు. అన్నీ తప్పటడుగులే! తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్‌ఆర్‌టీపీ అనే సొంత పార్టీని ఏర్పాటు చేశారు. తన సోదరుడు జగన్‌(Jagan) మీద ఉన్న కోపమో, అక్కసో తెలియదు కానీ తెలంగాణలో ఉద్దరిద్దామనుకున్నారు. పార్టీ పెట్టవద్దంటూ అప్పట్లో చాలామంది పెద్దలు నచ్చజెప్పారట! అయినా ఆమె వినలేదు. ఈ విషయం ఏపీ ప్రభుత్వప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala  Ramakrishna Reddy) ప్రెస్‌మీట్‌లో చెప్పారు కూడా! శ్రేయోభిలాషుల మాట కూడా కాదని తెలంగాణలో పార్టీ పెట్టారు.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) అధినేత్రి వై.ఎస్‌.షర్మిలకు(YS sharmila) ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఆమె వేస్తున్న ఏ అడుగు కూడా సరిగ్గా పడటం లేదు. అన్నీ తప్పటడుగులే! తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్‌ఆర్‌టీపీ అనే సొంత పార్టీని ఏర్పాటు చేశారు. తన సోదరుడు జగన్‌(Jagan) మీద ఉన్న కోపమో, అక్కసో తెలియదు కానీ తెలంగాణలో ఉద్దరిద్దామనుకున్నారు. పార్టీ పెట్టవద్దంటూ అప్పట్లో చాలామంది పెద్దలు నచ్చజెప్పారట! అయినా ఆమె వినలేదు. ఈ విషయం ఏపీ ప్రభుత్వప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) ప్రెస్‌మీట్‌లో చెప్పారు కూడా! శ్రేయోభిలాషుల మాట కూడా కాదని తెలంగాణలో పార్టీ పెట్టారు. పచ్చి సమైక్యవాది అయిన షర్మిల ఆకస్మాత్తుగా తెలంగాణ మీద అపారమైన ప్రేమను కురిపిస్తే ఎవరు మాత్రం నమ్ముతారు? అసలు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా తను తెలంగాణలో అడుగుపెడితే జనం నీరాజనాలు పడతారని అనుకున్నారు షర్మిల.

పాదాల మీద పాదయాత్ర చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మేస్తారని భావించారు. పాదయాత్ర చేస్తూ అప్పటి అధికారపార్టీ బీఆర్‌ఎస్‌(BRS) నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడారు. బండబూతులు తిట్టారు. ఇలా నోరుపారేసుకుంటూ ఎక్కువ పబ్లిసిటీ వస్తుందన్నది షర్మిల భావన కావచ్చు. పోలీసులతో(Police) తగవు కూడా పెట్టుకున్నారు. అప్పుడో పెద్ద సీన్‌ క్రియేట్‌ చేశారు. ఇంత చేసినా జనం మాత్రం షర్మిలను తేలిగ్గా తీసుకున్నారు. నీకు, నీ అన్నకు ఏమైనా గొడవలు ఉంటే ఆంధ్రాలోనే చూసుకోండి.. మా తెలంగాణను ఎందుకు లాగుతున్నారు అని తెలంగాణ ప్రజలు అనుకుని ఆమెను లైట్‌ తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్‌లో(Congress) పార్టీని విలీనం చేయడానికి సంసిద్ధురాలయ్యారు. డికే శివకుమార్‌(DK shiva Kumar) నుంచి సిఫారసు చేయించుకున్నారు. ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌గాంధీలను(Rahul Gandhi) కలుసుకున్నారు.

నా అన్నను జైల్లో పెట్టారంటూ అప్పట్లో తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన కాంగ్రెస్‌ అధినాయకత్వంపై పొగడ్తల వర్షం కరిపించారు. తన తండ్రిపై సోనియా, రాహుల్‌గాంధీల మనసుల్లో ఏ మాత్రం అభిమానం తగ్గలేదని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. అయినప్పటికీ ఆమె పార్టీని విలీనం చేసుకోలేదు. పార్టీ విలీనానికి డెడ్‌లైన్‌ విధించినప్పటికీ అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు. దీంతో తెలంగాణలో ఉన్న 119 స్థానాల నుంచి తమ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. రెండు రోజులకే మనసు మార్చుకున్నారు. తెలంగాణ ఎన్నికల(TS Elections) బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై(Revanth Reddy) నోరు పారేసుకున్నారు. రేవంత్‌ను దొంగ అన్నారు. అలాంటి వ్యక్తి సీఎం కాలేడని చెప్పారు.

కాంగ్రెస్‌ విజయం సాధించడంతో తనకు ఇంపార్టెన్స్‌ పెరుగుతుందని కలలుకన్నారు షర్మిల. గెలిచిన తర్వాత ఏ ఒక్కరు కూడా షర్మిలకు కృతజ్ఞతలు చెప్పలేదు. తెలంగాణలో పార్టీకి మనుగడ లేదని తెలుసుకున్న షర్మిల ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి పెట్టారు. ఏపీ కాంగ్రెస్ సార‌థ్య బాధ్య‌త‌లు ష‌ర్మిల‌కు ఇస్తార‌ంటూ ఆంధ్రజ్యోతి ఫ్రంట్‌పేజీలో ఓ ఆర్టిక్‌ రాసింది. క్రిస్మస్‌ పండుగ రోజు టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు(Nara Lokesh) క్రిస్మస్‌(Christmas gift) స్పెషల్‌ గిఫ్టులు పంపారు షర్మిల. ఇది వైఎస్‌ఆర్‌ అభిమానులకు బాగా కోపం తెప్పించింది. ఇన్నాళ్లు లేనిని ఇప్పుడు క్రిస్మస్‌ కానుకలను ఎందుకు పంపించినట్టు? మొన్నటి వరకు తిట్టిపోసిన చంద్రబాబు ఫ్యామిలీకి అభిమాన సందేశాలు పంపడమేమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. మొత్తంగా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమె వేసిన ప్రతి అడుగు, తీసుకున్న ప్రతి నిర్ణయం, చేపట్టిన ప్రతి చర్య ఆమె గౌరవాన్ని తగ్గించాయే తప్ప పెంచలేదు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలను ఆమెకు అప్పగిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. తద్వారా ఆమె ఏం సాధిస్తారు? జగన్‌తో గొడవలు ఉంటే పెద్దల సమక్షంలో ఇద్దరూ కూర్చొని పరిష్కరించుకోవచ్చు. కానీ షర్మిల అలా చేయడం లేదు. అన్న కంట్లో నలుసులా తయారవుతున్నారు. ఇలాగే సాగితే ఎవరికి నష్టం? జగన్‌ ప్రత్యర్థులకు షర్మిల చర్యలు నచ్చవచ్చు. ఆమెను ప్రోత్సహించవచ్చు. ఆమెను వీరనారి అంటూ కీర్తించనూ వచ్చు. ఆమె ఏపీకి వెళ్లినా ఏం సాధించలేరు? తన పరువును మరింత తగ్గించుకోవడం తప్పితే ఏమీ జరగదు. ఇప్పుడు ఎవరైతే బాకాలు ఊదుతున్నారో అప్పుడు షర్మిల మొహం కూడా చూడరు. ఈ విషయాన్ని షర్మిల ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో!

Updated On 26 Dec 2023 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story