ఇటీవల వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించాల్సివుంది.

ఇటీవల వైఎస్ షర్మిల(YS Sharmila)ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలి(AP PCC President)గా నియమించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించాల్సివుంది. జనవరి 21న కొత్త అధ్య‌క్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌(Manickam Tagore)తో పాటు పార్లమెంట్‌ సభ్యులు సిడి మాయప్పను(CD Mayappanu), ఎఐసిసి కార్యదర్శి క్రిస్టోఫర్‌ తిలక్‌(Christopher Tilak) తదితరులు పాల్గొంటారని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీడబ్ల్యూసీ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు.

వైఎస్ షర్మిల ఈ నెల మొదట్లో కాంగ్రెస్‌లో చేరారు. ఆమె తన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(YSR Telangana)ని కూడా కాంగ్రెస్‌(Congress)లో విలీనం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆమెను పార్టీ అధ్యక్షురాలిగా నియ‌మిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraju) రాజీనామా చేసిన అనంత‌ర‌మే ష‌ర్మిలకు ఆ ప‌ద‌విని అప్ప‌గించింది అధిష్టానం. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఆమె త‌న సోద‌రుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy)ని ఢీకొన‌నున్నారు.

గత ఏడాది నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్రంలో పార్టీ విజ‌య‌ అవకాశాలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

Updated On 17 Jan 2024 10:20 PM GMT
Yagnik

Yagnik

Next Story