Ys Sharmila : వివేకా హత్యపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల ఒక అంశం నన్ను ఆలోచింప జేసిందని షర్మిల అన్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారిని అవినాష్ ఇంటికి పిలిపించుకున్నాడని.

ఇటీవల ఒక అంశం నన్ను ఆలోచింప జేసిందని షర్మిల అన్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారిని అవినాష్ ఇంటికి పిలిపించుకున్నాడని.. అక్కడ బెదిరించి, ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ ఇప్పించారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. సంతకం పెట్టించి రిపోర్ట్ ఫైల్ చేశారని.. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అంటే అవినాష్(Ys Avinash) స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఆమె అన్నారు. బెయిల్ మీద బయట ఉన్నాడు కాబట్టే స్వేచ్ఛగా సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని.. సునీత(Ys Sunitha)నే వివేకాను హత్య చేయించింది అని కొత్త రిపోర్ట్ రాయించారని.. అధికారితో సంతకం పెట్టించారని షర్మిల(Ys Sharmila) ఆరోపించారు. బెయిల్ మీద ఉన్న వాళ్ళు సాక్ష్యాలు తారుమారు చేస్తే ..ఇక వాళ్ళు బయట ఉండాలా ? జైలులో ఉండాలా ? అని ప్రశ్నించారు.
హత్య జరిగిన సమయంలో సునీత తన భర్త అక్కడ లేరు, అవినాష్ రెడ్డి మాత్రమే ఉన్నాడు. రక్తపు మరకలు అన్నీ తుడిపించాడు, అన్ని సాక్ష్యాలు అవినాష్‌రెడ్డి చేయించాడని ఆమె ఆరోపించారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా... అవినాష్‌రెడ్డి తప్పు చేయలేదు అని రిపోర్ట్‌లు రాయిస్తున్నారని షర్మిల అన్నారు. ఇలా అయితే న్యాయం ఎక్కడ జరుగుతుంది? సునీతకు ఎప్పుడు న్యాయం జరగాలి? సునీత ప్రాణాలకు భద్రత ఉందా ? సునీతకు నేను ఆ రోజే చెప్పాను, నాన్నకు నువ్వు ఒక్కదానివే అని చెప్పానని అన్నారు. న్యాయం కోసం కోట్లాడాలి అని చెప్పానని, నెను సునీత పక్కన నిలబడతాను అని హామీ ఇచ్చానన్నారు. ఎదుర్కొనేది ఎంత పెద్ద వాళ్లుని తెలిసి కూడా నిలబడ్డాను, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సునీతకు న్యాయం కోసం నిలబడ్డానని షర్మిల అన్నారు.
