ఆ యువకుడు నమస్తే అక్కా అంటూ సీఎం జగన్ తమకు మంచే చేశాడు అంటూ

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాలో బస్సు యాత్రలో ఉన్నారు. దువ్వూరులో ఉన్నప్పుడు ఆమె ఓ యువకుడు ఊహించని షాక్ ఇచ్చాడు. షర్మిల ప్రసంగిస్తుండగా, జగన్ వీరాభిమానులు కొందరు నినాదాలు చేశారు. జై జగన్ అంటున్న వారిలో నుంచి ఒక యువకుడ్ని పిలిచారు షర్మిల. ఇక్కడికి వచ్చి మాట్లాడండి అంటూ అతడికి మైక్ అందించారు. జగన్ కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పండని అన్నారు.

ఆ యువకుడు నమస్తే అక్కా అంటూ సీఎం జగన్ తమకు మంచే చేశాడు అంటూ చెప్పాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ప్రజల కోసం తిరుగుతూనే ఉన్నాడని వివరించాడు. జగన్ చెప్పినవాటిల్లో ప్రతి ఒక్కటీ చేశాడని కొనియాడాడు. 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పాడని, మాట నిలబెట్టుకున్నాడని ఆ యువకుడు చెప్పాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబానికి సంక్షేమం అందిందని.. అందుకు కారణం జగన్ మోహన్ రెడ్డి అని చెప్పాడు. మీరు కుటుంబ తగాదాల వల్లనే జగన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆ యువకుడు చెప్పడంతో షర్మిల షాక్ అయ్యారు.

Updated On 8 April 2024 9:13 PM GMT
Yagnik

Yagnik

Next Story