వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, వై.ఎస్‌.షర్మిలా రెడ్డి మధ్య ఏర్పడిన ఆస్తుల పంచాయితీ రాష్ట్ర సమస్యగా మారిపోయింది.

వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, వై.ఎస్‌.షర్మిలా రెడ్డి మధ్య ఏర్పడిన ఆస్తుల పంచాయితీ రాష్ట్ర సమస్యగా మారిపోయింది. మరీ ముఖ్యంగా టీడీపీకి, ఆ పార్టీ అనుకూల మీడియాకు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లయ్యింది. రోజుకో కొత్త విషయాన్ని ప్రజల ముందుకు తెస్తున్నదా మీడియా! అసలు ఇంతకీ అన్న జగన్‌ను షర్మిల అడిగిన సొమ్మెంత? అన్నదే ఆసక్తిగా మారింది. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడు నలుగురు పిల్లలకు సమానంగా ఆస్తులను ఇవ్వాలని చెప్పారని, ఆ లెక్కన తనకు వాటా ఇవ్వాల్సిందేనని షర్మిల పంతం పట్టారట. 2019లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఎందుకొచ్చిన పంచాయితీ అని అనుకుని తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పేర్లతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అప్పడే షర్మిల ఎలాంటి ఎంఓయూలు రాయించాల్సిన అవసరం లేదని, ఒకవేళ రాయించినా వాటిని చించిపారేస్తానని అన్నారట! తనకు వాటాగా ఎంత రావాలో అదంతా నగదు రూపంలోనే ఇవ్వాలని జగన్‌ను డిమాండ్‌ చేసిందట! నగదు అంటే ఎంతనుకున్నారు? అక్షరాల 2 వేల కోట్ల రూపాయలు! షర్మిల గొంతెమ్మ కోరిక చూసి జగన్‌ బిత్తరపోయారు. అంత సొమ్ము ఇచ్చుకోలేనని ప్రేమపూర్వకంగా చెప్పారు. ఇది షర్మిలకు కోపం తెప్పించింది. ఆ కోపంతో జగన్‌పై కసి పెంచుకున్నారు. ఆస్తుల అటాచ్‌మెంట్ పేరుతో త‌న‌ను అన్న మోసం చేస్తున్నార‌నేది ఆరోపించడం మొదలు పెట్టారు. ష‌ర్మిలకు తల్లి విజయమ్మ వంత పాడారట! షర్మిల అడుగుతున్న రూ.2 వేల కోట్లు ఇవ్వాల‌ని విజ‌య‌మ్మ కూడా చెప్పారట! అంటే కూతురు షర్మిల వైపుకు విజయమ్మ వెళ్లిపోయారనే అనుకోవాలి. తాను అనుకున్నది దక్కకపోయే సరికి షర్మల పంతానికి పోయారు. జగన్‌ శత్రువులతో చేతులు కలిపారు. టీడీపీ అనుకూల మీడియాకు దగ్గరయ్యారు. తెలియకుండానే వైఎస్‌ కుటుంబాన్ని రోడ్డున పడేశారు. ఆమె అడిగిన సొమ్మును జగన్‌ ఇచ్చేసి ఉంటే ఆమె పాలిటిక్స్‌లోకి వచ్చి ఉండేవారు కాదన్నది ఓ టాక్‌.

ehatv

ehatv

Next Story