షర్మిల(Sharmila) ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌(AP congress) అధ్యక్ష పదవి చేపట్టనుందని రెండు, మూడు రోజులుగా కథనాలు వస్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో షర్మిల అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ కె.ఎస్.ప్రసాద్‌(KS Prasad) 'ఈహ' చానెల్‌లో(EHA TV) డిబెట్‌లో ఈ అంశంపై స్పందిచారు. షర్మిల ఏపీకి వెళ్లే అవకాశమే లేదని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు.

షర్మిల(Sharmila) ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌(AP congress) అధ్యక్ష పదవి చేపట్టనుందని రెండు, మూడు రోజులుగా కథనాలు వస్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో షర్మిల అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ కె.ఎస్.ప్రసాద్‌(KS Prasad) 'ఈహ' చానెల్‌లో(EHA TV) డిబెట్‌లో ఈ అంశంపై స్పందిచారు. షర్మిల ఏపీకి వెళ్లే అవకాశమే లేదని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ ఇంకా విలీనం చేయలేదని.. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారని.. ఆమెకు తెలంగాణలో ప్రాతినిధ్యం ఉండగా ఏపీకి ఎలా వెళ్తారన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్‌ నేతలైన రఘువీరారెడ్డి(Raghuveera Reddy), శైలజానాథ్‌(Shailajanath), జేడీ శీలంలాంటి నేతలను కాంగ్రెస్‌ కాపాడుకోలేకపోయిందని ఆయన విశ్లేషించారు. వీరంతా కాంగ్రెస్‌ను పట్టుకొనే ఉన్నారని.. వీరిని కాదని షర్మిలను తెచ్చుకొని ఏపీలో కాంగ్రెస్‌ చేసేదేమీ లేదన్నారు. వైఎస్‌ లెగసీ(YS Legacy) వస్తుందని కొందరంటున్నారు.. అలాంటప్పడు ఆ సమయంలో వైఎస్ జగన్‌, షర్మిలను కాంగ్రెస్‌ ఎందుకు వదులుకుందని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ కుమారుడు, కూతురు మీద ప్రేమ ఉంటే అప్పుడే కాంగ్రెస్‌ ఎందుకు వదులుకుంటుందన్నారు. తెలుగురాష్ట్రాలు వివక్షకు కారణం బీజేపీ, కాంగ్రెస్సేనని అన్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ, ఏపీకి ఈ రెండు పార్టీలు తీవ్ర అన్యాయం చేశాయన్నారు.

Updated On 27 Dec 2023 2:03 AM GMT
Ehatv

Ehatv

Next Story