వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. షర్మిల బుధవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(YSRTP) వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila) గురువారం కాంగ్రెస్‌(Congress)లో చేరే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. షర్మిల బుధవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ(Delhi)కి చేరుకున్నారు. 'చాలా ప్రముఖ వ్యక్తి' గురువారం ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ(AICC) ప్రధాన కార్యాలయంలో పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ బుధవారం తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న షర్మిలను కాంగ్రెస్‌(Congress)లో చేరుతున్నారా అని అడగ‌గా.. ఆమె విలేకరులతో “అవును, అలాగే ఉంది” అని అన్నారు.

మంగళవారం హైదరాబాద్‌(Hyderabad)లో జరిగిన పార్టీ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. తాను, ఇతర పార్టీ నాయకులు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో సహా కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని కలుస్తామని.. ఢిల్లీలో “కీలకమైన” ప్రకటన చేస్తామ‌ని చెప్పారు.

షర్మిల అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekar Reddy) కుమార్తె. అలాగే ప్ర‌స్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) చెల్లెలు కావ‌డంతో ఆమె చేరిక విష‌యం రాజ‌కీయంగా తీవ్ర‌చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ష‌ర్మిల‌ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పదవి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని.. లేదంటే ఏపీసీసీ(APPCC) ప్ర‌సిడెంట్‌గా కూడా చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ(Telangana)లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌(KCR) నేతృత్వంలోని బీఆర్‌ఎస్(BRS) పాలనను అంతమొందించేందుకు షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.

Updated On 3 Jan 2024 10:27 PM GMT
Yagnik

Yagnik

Next Story