YS Sharmila Congress : కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
కొన్ని నెలల ఊహాగానాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(YS sharmila) గురువారం కాంగ్రెస్(Congress) లో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjuna Kharge), రాహుల్ గాంధీల(Rahul gandhi) సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు.
కొన్ని నెలల ఊహాగానాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(YS sharmila) గురువారం కాంగ్రెస్(Congress) లో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjuna Kharge), రాహుల్ గాంధీల(Rahul gandhi) సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు విలీనం కార్యరూపం దాల్చలేదు. అయితే ఆమె "కాంగ్రెస్ అనుకూల ఓట్లను చీల్చడం ఇష్టంలేక" ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.
షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ఏపీలో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో అన్నచెల్లెలి మధ్య గట్టీ పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇది జగన్ భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం చూపవచ్చు. 2014లో విభజన జరిగినప్పటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి క్షీణించింది. ఈ క్రమంలో షర్మిల చేరిక రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నూతనోత్సాహాన్ని ఇస్తుందనేది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.