వైఎస్సార్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ ష‌ర్మిల(YS sharmila) రాహుల్ గాంధీకి(Rahul gandhi) ట్విట‌ర్‌ వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. గ‌త కొద్ది రోజులుగా ష‌ర్మిల త‌న పార్టీని కాంగ్రెస్‌లో(congress) విలీనం చేయ‌నున్నార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో.. ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. ష‌ర్మిల ట్వీట్‌లో..

వైఎస్సార్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ ష‌ర్మిల(YS sharmila) రాహుల్ గాంధీకి(Rahul gandhi) ట్విట‌ర్‌ వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. గ‌త కొద్ది రోజులుగా ష‌ర్మిల త‌న పార్టీని కాంగ్రెస్‌లో(congress) విలీనం చేయ‌నున్నార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో.. ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. ష‌ర్మిల ట్వీట్‌లో.. రాహుల్ గాంధీ గారికి జ‌న్మ‌దిన శ‌భాకాంక్ష‌లు. మీరు మీ పట్టుదల, సహనంతో ప్రజలకు స్ఫూర్తినిస్తూ వారికి సేవ చేస్తూ ఉండండి. మీరు మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉంటూ.. సమృద్ధిగా విజయం సాధించాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు.

ఇటీవ‌ల ష‌ర్మిల పార్టీ విలీన వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి షర్మిళ జై కొట్టింద‌ని.. వైఎస్ఆర్ తనయురాలు తెలంగాణలో పార్టీ జెండా పీకేయనుంద‌ని.. కేవీపీ రామచంద్రా రావు, డీకే శివకుమార్ ల వ్యూహం ఫ‌లించింద‌ని.. కాంగ్రెస్ పార్టీలో చేరికకు వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయ్యింద‌ని వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. పాలేరు నుండి పోటీకి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పడంతో.. వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అంగీకరించార‌నేది వార్త సారాంశం. ఈ వార్త విష‌య‌మై అటు కాంగ్రెస్ నుంచి కానీ.. ఇటు ష‌ర్మిల వైపు నుంచి కానీ ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డం విశేషం.

Updated On 19 Jun 2023 12:04 AM GMT
Ehatv

Ehatv

Next Story