YS Sharmila : వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టును పట్టించుకోనివారు ఎలా ఆయన వారసులు అవుతారు.?
గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను APCC చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతుంటే.. సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబుపై సెటైర్లు సంధించారు.
గుండ్లకమ్మ ప్రాజెక్ట్(Gundlakamma Project) ను APCC చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతుంటే.. సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu)పై సెటైర్లు సంధించారు. ఇది వైఎస్సార్(YSR) కట్టిన ప్రాజెక్ట్.. 750 కోట్లు పెట్టి కట్టారు.. లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. 12 మండలాల ప్రజలకు, ఒంగోలు(Ongole) పట్టణానికి త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు నిర్వహణ లేకనే గేట్లు కొట్టుకు పోయాయి అని చెప్పారని పేర్కొన్నారు. మరమత్తులు చేయాల్సింది పోయి ప్రాజెక్ట్ నిర్వహణలో లోపాలు అని చెప్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ జలయజ్ఞం దోపిడీ అని అర్థం లేని ఆరోపణలు చేసిందన్నారు. ఇళ్లు కట్టుకున్నా.. దానికి నిర్వహణ అవసరం.. పట్టించుకోకుండా ఉంటే ఏదైనా తుప్పుపడుతుందన్నారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం గేట్లు కొట్టుకు పోతుంటే డ్యాన్సులు చేస్తుందన్నారు. మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు తప్పా.. పని చేయరని ఎద్దేవా చేశారు. జగన్ ఆన్నకు మరమత్తులు చేయించడానికి మనసు రావడం లేదట అని దుయ్యబట్టారు. ఇదేనా వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం అంటే.. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్ ను పట్టించుకోని వీరు.. ఎలా వైఎస్సార్ వారసులు అవుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. లేకుంటే ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
10 కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ నిలబడుతుందన్నారు. ప్రాజెక్ట్ కింద వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు(Veligonda)ను సైతం నిర్లక్ష్యం చేశారని.. 40 TMC సామర్ధ్యం కలిగిన అతిపెద్ద ప్రాజెక్ట్ వెలిగొండ.. 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ సైతం పక్కన పడింది. గత 10 ఏళ్లలో చంద్రబాబు(Chandrababu), జగన్(Jagan) ఆన్న తట్టెడు మట్టి కూడా మోయలేదన్నారు.