ఏలేరు రైతులను నిండా ముంచిందని.. వేల ఎకరాలు నీట మునిగాయి.. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలేన‌ని APCC చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు

ఏలేరు రైతులను నిండా ముంచిందని.. వేల ఎకరాలు నీట మునిగాయి.. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలేన‌ని APCC చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏలేరు మరమ్మత్తుల మీద ఎవరు దృష్టి పెట్టలేదన్నారు. మరమత్తులు లేక రైతులు దారుణంగా నష్టపోయారు. ఒక్కో రైతు ఇప్పటి వరకు 30 వేల వరకు పెట్టుబడి నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి మొత్తం వరదపాలు అయింది. ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారు. 135 కోట్లు కూడా విడుదల చేశార‌ని గుర్తుచేశారు. వైఎస్ఆర్ చనిపోయాక ఏలేరు ఆధునీకరణ పై ఎవరు దృష్టి పెట్టలేదన్నారు. ఇప్పుడు బాబు జగన్ తప్పిదమే అంటున్నాడు.. జగన్ బాబు తప్పిదం అంటున్నారు.. బాబు హయాంలో ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదు.? అని ప్ర‌శ్నించారు. గత 10 ఏళ్లుగా ఏలేరు ఆధునీకరణపై ఇద్దరికీ పట్టింపు లేదన్నారు.

జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారన్నారు. తట్టెడు మట్టి కూడా తీయలేదని.. డ్యాం లు కొట్టుకుపోతున్నా జగన్ కి పట్టింపు లేకుండే.. నిర్లక్ష్యం ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాలు నష్టం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు ఎకరాకు 10 వేల పరిహారం ఇస్త అన్నారు. రూ.10 వేలు ఇస్తే ఏ మూలకు చాలుతుందో చెప్పాలి. కనీసం ఎకరాకు రూ.25 వేల పరిహారం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో ఎకరాకు 4 వేల పరిహారం అని మోసం చేశాడని.. జగన్ చేసిన మోసం మళ్ళీ బాబు చేయొద్దు అని సూచించారు. రాష్ట్రంలో జరిగిన నష్టంపై వెంటనే పరిహారం ఇవ్వండని.. ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వానికి రాష్ట్రం అంటే చిన్న చూపు.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story