YS Sharmila : బీజేపీకి బానిసలుగా మారిన జగన్కు, బాబుకు ఎందుకు ఓటు వేయాలి..?
అనంతపురం జిల్లా అంటే వైఎస్సార్ కి ప్రియమైన జిల్లా అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ జిల్లా కరువు జిల్లా. దేశంలోనే అత్యల్ప వర్షపాతం ఉన్న జిల్లాలో రెండో స్థానం.
అనంతపురం(Ananthapuram) జిల్లా అంటే వైఎస్సార్(YSR() కి ప్రియమైన జిల్లా అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) అన్నారు. ఈ జిల్లా కరువు జిల్లా. దేశంలోనే అత్యల్ప వర్షపాతం ఉన్న జిల్లాలో రెండో స్థానం. ఈ జిల్లా ప్రజలను బ్రతించుకోవాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గం అని వైఎస్సార్ నమ్మాడు. ఇక్కడ ప్రజలకు మంచినీళ్ళ కోసం రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) తాత పేరు మీద మంచినీటి పథకం ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. వైఎస్సార్ హయాంలో ఇక్కడ 22 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట వేసే వారు. వేరు శెనగ పంట పండక పోతే డబ్బులు పండిస్తాం అన్నారు. వైఎస్సార్ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది. రైతులకు బరోసా ఉండేది. కానీ, ఇప్పుడు 3 లక్షల ఎకరాల్లో కూడా పంట వేయడం లేదని.. భీమా లేకపోవడంతో రైతులు సాహసం చేయడం లేదని.. దీనికి కారణం జగన్ ఆన్న ప్రభుత్వమేనన్నారు.
వైఎస్సార్ హయాంలో వ్యవసాయంపై సబ్సిడీ ఉండేది. అన్ని రకాల పరికరాలు సబ్సిడీ పై వచ్చేవి. ఇప్పుడు సబ్సిడీ అనే పథకమే లేదు. సబ్సిడీలు ఎత్తివేసిన జగన్(Jagan) ఆన్న ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పేవారు. రాయగుండం ఐరెన్ ఒర్ తీసి ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. వైఎస్సార్ వెళ్ళిపోయాక.. ఈ పరిశ్రమ వెళ్ళిపోయింది. వైఎస్సార్ వెళ్ళిపోయాక రఘువీరా రెడ్డి రైతుల కోసం చాలా తాపత్రయ పడ్డాడు.ఇక్కడ రైతులకు మేలు చేసేందుకు కేంద్రానికి లేఖ రాశాడు. ప్రాజెక్ట్ అనంత సృష్టికర్త రఘువీరా రెడ్డి. 8 వేల కోట్ల రూపాయలు కూడా విడుదల చేయించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అన్ని ఇక్కడే వచ్చేవి. కాంగ్రెస్ ఓడిపోవడంతో అంతా వృధా అయ్యిందన్నారు.
గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ అధికారంలో ఉండి ప్రాజెక్ట్ అనంత గురించి పట్టించుకోలేదన్నారు. బీజేపీ(BJP)కి బానిసలుగా మారి.. అనంత ప్రాజెక్ట్ కు తూట్లు పొడిచారని విమర్శించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే.. రూ.6.50 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే .. నాలుగు జిల్లాలకు సాగునీరు వచ్చేవి. 90 శాతం పనులు హంద్రీనీవా పనులు వైఎస్సార్(YSR) పూర్తి చేశారు. 10 శాతం పనులు జగన్ ఆన్న పూర్తి చేయలేక పోయాడన్నారు. హంద్రీనీవా కోసం జల దీక్ష కూడా చేశాడు. 6 నెలల్లో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చారు. ఇది నా పుట్టిల్లు.. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి.. ఇక్కడ ప్రజల హక్కులు హరిస్తున్నరు కాబట్టి.. టీడీపీ, వైసీపీ లు బీజేపీకి బానిసలు గా మారి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు కాబట్టి.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడటానికి వైఎస్సార్ బిడ్డ అడుగు పెట్టిందని తెలిపారు.
బీజేపీకి బానిసలుగా మారిన జగన్ కి, బాబు(Chandrababu) కి ఎందుకు ఓటు వేయాలన్నారు. ఆంధ్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టినందుకు ఓటు వేయాలా.? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజల కోసం కొట్లాడుతుంటే నాపై దాడులు చేస్తున్నారని అన్నారు. నాపై ఎంత దాడులు చేసినా పర్వాలేదు.. నా కుటుంబాన్ని చీల్చినా పర్వాలేదు.. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికి అయినా సిద్ధమన్నారు. జగన్ ఆన్న ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదన్నారు. జనవరి 1న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు.. 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ రాలేదు.. కనీసం ఒక డీఎస్సీ కూడా లేదని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.