గత ప్రభుత్వ హయాంలో గనుల కుంభకోణంలో(Mining Scam) వేల కోట్లు దొబ్బి తిన్నారని షర్మిల(YS sharmila) తీవ్రమైన ఆరోపణలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో గనుల కుంభకోణంలో(Mining Scam) వేల కోట్లు దొబ్బి తిన్నారని షర్మిల(YS sharmila) తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎక్స్‌లో ట్వీట్‌చేస్తూ 'గనుల దోపిడీపై వెంకట్‌రెడ్డి(Venkat reddy) లాంటి తీగలే కాదు... పెద్ద డొంకలు కూడా కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా..విచారణ జరపాలి. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే...తెరవెనుక ఉండి,సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు. టెండర్లు,ఒప్పందాలు,APMMC నిబంధనలన్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు.NGT నిభందలను తుంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ACB విచారణతో పాటు..పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలి. కూటమి సర్కార్ ను డిమాండ్ చేస్తున్నాం..సహజ వనరుల దోపిడీపై CBI విచారణను కోరండి' అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story