ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) రద్దుకు కుట్ర జరుగుతోందని అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్‌ అని అన్నారు షర్మిల(YS Sharmila).

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) రద్దుకు కుట్ర జరుగుతోందని అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్‌ అని అన్నారు షర్మిల(YS Sharmila). వందశాతం వాటాలు బదలాయిస్తామని ఎంవోయూ(MOU) పై వైఎస్‌ జగన్‌ సంతకం చేశారు. బెయిల్‌ రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా? అని నిలదీశారు. 2021లో క్లాసిక్‌ రియాలిటీ, సండూర్‌, సరస్వతి షేర్లను ఎలా అమ్మారు? విజయమ్మకు 42 కోట్ల రూపాయలకు షేర్లు ఎలా అమ్మారు? షేర్లు అమ్మడం స్టేటస్‌ కోను ఉల్లంఘించినట్లు కాదా? అని ప్రశ్నించారు. షేర్ల బదిలీకి, బెయిల్‌ రద్దుకు సంబంధం లేదని మీకు తెలుసు కాబట్టే షేర్లను విక్రయించి, సంతకాలు చేశారని షర్మిల ఆరోపించారు. షేర్లు (Shares) అమ్మేసుకుని ఇప్పుడేమో రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్‌ బెయిల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదన్న విషయం విజయమ్మకు కూడా తెలుసన్నారు.

Eha Tv

Eha Tv

Next Story