తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇవాళ చేసిన వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టులాంటివని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిల అన్నారు.

తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇవాళ చేసిన వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టులాంటివని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిల(AP PCC YS Sharmila) అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని, సీబీఐ(CBI) విచారణ చేపట్టాలని మొదటి నుంచి కాంగ్రెస్‌ చెబుతూనే ఉందని ఆమె అన్నారు. సుప్రీం సూచన కాంగ్రెస్‌ డిమాండ్‌కు బలం ఇచ్చినట్టు అయ్యిందని షర్మిల చెప్పారు. సిట్‌ (SIT)దర్యాప్తు రబ్బర్‌ స్టాంప్‌ తప్పా విచారణకు ఉపయోగపడదని తెలిపారు. సీబీఐకి అప్పగిస్తేనే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు తెలుస్తాయని, కల్తీ ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? పాల్పడిన దొంగలు ఎవరు? అన్నది తేలిపోతుందని చెప్పారు.

ehatv

ehatv

Next Story