పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతు ఉంటే.. అని ఏపీ కాంగ్రెస్‌(APCC) అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila), ఆమె సోదరి సునీత(YS Sunitha) వివేకా పాట పాడుకుంటూ వచ్చారు. ఠాట్‌.. మీరు ఆ పాట పాడటానికి వీల్లేదని కోర్టు ఆదేశించడంతో అక్కా చెల్లెళ్ల పరిస్థితి ఒడ్డున పడిన చేపల్లా తయారయ్యింది. మొన్నటి వరకు వీరిద్దరు వివేకా హత్యపై చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొచ్చారు.

పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతు ఉంటే.. అని ఏపీ కాంగ్రెస్‌(APCC) అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila), ఆమె సోదరి సునీత(YS Sunitha) వివేకా పాట పాడుకుంటూ వచ్చారు. ఠాట్‌.. మీరు ఆ పాట పాడటానికి వీల్లేదని కోర్టు ఆదేశించడంతో అక్కా చెల్లెళ్ల పరిస్థితి ఒడ్డున పడిన చేపల్లా తయారయ్యింది. మొన్నటి వరకు వీరిద్దరు వివేకా హత్యపై చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఏదో రకంగా లబ్ధి పొందాలని అనుకున్న వీరి ఆశలపై న్యాయస్థానం నీళ్లు కుమ్మరించింది. వీరిద్దరే కాదులేండి.. తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), భారతీయ జనతా పార్టీలు(BJP) కూడా వివేకానందరెడ్డి(Vivekananda Reddy) హత్యలోంచి నాలుగైదు ఓట్లు ఏరుకుందామనుకున్నాయి. పాపం మూడు పార్టీల కూటమికి కూడా గొంతు పెగలడం లేదిప్పుడు. వివేకా హత్యపై ఎవరూ మాట్లాడకూడదని కోర్టు ఆదేశాలివ్వడాన్ని సునీత, షర్మిల జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కాకుండా తాము మాట్లాడేందుకు మరే టాపిక్ లేకపోవడంతో కడప కోర్టు(Kadapa Court) ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టను ఆశ్రయించారు సునీత. పులివెందుల తెలుగుదేశంపార్టీ అభ్యర్థి బీటెక్‌ రవి ఆమెకు జతకలిశారు. వివేకానందరెడ్డి హత్య కేసుతో వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిని ముడిపెట్టి, ఆ విధంగా జగన్మోహన్‌రెడ్డిని ఇబ్బందులపాల్జేయాలన్నది వీరి దురాలోచన! టీడీపీ అనుకూల మీడియా అయితే న్యాయస్థానాలను విమర్శించడానికి కూడా వెనుకాడటం లేదు. ఫస్ట్రేషన్ వారితో ఆ పని చేయిస్తోంది. వివేకా హత్యను అడ్డం పెట్టుకుని మరో పది పన్నెండు పలుకులు రాసుకుందామనుకున్న వారికి కూడా ఇప్పుడు పెన్ను ఆడటం లేదు. కడప లోక్‌సభకు పోటీ చేస్తున్న షర్మిల తనను గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుకోకుండా ఎంతసేపూ వివేకా హత్య గురించే మాట్లాడితే వినేవాళ్లకైనా బోర్‌ కొట్టదు. చంద్రబాబు బ్యాచ్‌ తయారుచేసిన స్క్రిప్ట్‌ ప్రకారం నడుచుకుంటున్న అక్కాచెల్లెళ్లకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. వివేకా హత్య గురించి మాట్లాడకపోతే ఆ ఇద్దరిని చూసేవాళ్లుండరు. అందుకే హైకోర్టు తలుపుతట్టారు.

Updated On 24 April 2024 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story