ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(APCC Chief YS Sharmila Reddy) శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. షర్మిలా రెడ్డి తో పాటు బస్సులో మాణిక్కం ఠాగూర్, గిడుగు రుద్ర‌రాజు, రఘువీరా రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె బస్సులో ప్రయాణం చేశారు. బస్సులో షర్మిల ప్రయాణికులతో ముఖాముఖీ భేటీ అయ్యారు.

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(APCC Chief YS Sharmila Reddy) శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. షర్మిలా రెడ్డి తో పాటు బస్సులో మాణిక్కం ఠాగూర్, గిడుగు రుద్ర‌రాజు, రఘువీరా రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె బస్సులో ప్రయాణం చేశారు. బస్సులో షర్మిల ప్రయాణికులతో ముఖాముఖీ భేటీ అయ్యారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy )వ్యాఖ్య‌ల‌కు బ‌దులిచ్చారు. సుబ్బారెడ్డికి నేను జగన్ రెడ్డి అంటే నచ్చలేదట.. ఇప్పటినుంచి జగన్ ఆన్న గారు అనే అంటాన‌ని.. నాకేం అభ్యంతరం లేదన్నారు. నాకు అభివృద్ధి గురించి చూపిస్తా అని సవాల్ విసిరారు. సరే సార్.. మీరు చేసిన అభివృద్ధి చూపించండి. మీ అభివృద్ధి చూడటానికి నేను సిద్ధం.. డేట్, టైం మీరు చెప్పండి.. లేదా నన్ను చెప్పమన్నా నేను చెప్తాన‌ని స‌వాల్ విసిరారు. ఈ భేటీకి మేధావులను కూడా పిలుద్ధాం.. నాతో పాటు మీడియా వస్తుంది.. ప్రతిపక్షాలు వస్తాయి.. మా అందరికీ చూపించండన్నారు. మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ.? మీరు చెప్పిన రాజధాని ఎక్కడ.? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ.? మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటుంది. మీ సవాల్ ను స్వీకరిస్తున్నానని ష‌ర్మిల‌ అన్నారు.

Updated On 23 Jan 2024 1:30 AM GMT
Ehatv

Ehatv

Next Story