ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలకు తన అన్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy)ని తిడితే కానీ పొద్దుగుంకదు.

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలకు తన అన్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy)ని తిడితే కానీ పొద్దుగుంకదు. విమర్శల స్తోత్రం అందుకుంటే కానీ పొద్దుపొడవదు. అసలు జగన్‌ను తిట్టకుంటే ఆమెకు పొద్దేగడవదు. తిట్టడానికి ఏ అవకాశమూ లేకపోతే తానే అవకాశాన్ని సృష్టించుకోగలరు. అది తన బలమని ఆమె అనుకుంటారు కానీ అదే తన బలహీనత అని తెలుసుకోలేకపోతున్నారు. ఏపీకి ఇంకా జగనే ముఖ్యమంత్రి అని షర్మిల అనుకుంటున్నారేమో! అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandra Babu)ను పల్లెత్తు మాట అనడం లేదు. ఏపీలో జరుగుతున్న ప్రతిదానికీ గత వైసీపీ(YCP) ప్రభుత్వమే కారణమని చంద్రబాబు విమర్శిస్తున్నారు సరే, షర్మిల(YS Sharmila)కూడా అలా ఎందుకు అనడం? ఇప్పుడు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై షర్మిల సోషల్‌ మీడియా వేదికగా రియాక్టయ్యారు. చిత్రమేమిటంటే ఇందులో కూడా చంద్రబాబును వదిలేసి జగన్‌ను షర్మిల విమర్శించడం! నీచ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు అయితే వైసీపీని కూడా ముడిపెట్టారు షర్మిల. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా చంద్రబాబు మాట్లాడితే ఈ అంశంలో కూడా జగన్‌ను లాగడమేమిటన్నది చాలా మంది సందేహం. దీన్ని బట్టి అన్నపై షర్మిలకు పీకల్దాక కోపం ఉన్నదని అర్థమవుతోంది. విమర్శలు చేయడానికైనా వేళాపాళా ఉండాలి. సమయం సందర్భం ఉండాలి. అన్న మీద వ్యక్తిగత కక్ష ఉంటే ఉండొచ్చు. ఆ కోపాన్ని ఇంటికే పరిమితం చేయాలి. రాజకీయాల్లో ఇలాంటి అకారణ విమర్శలు శోభనివ్వవు.

ehatv

ehatv

Next Story