సరస్వతి షేర్స్‌(Saraswati shares) అటాచ్‌ కాలేదు..

సరస్వతి షేర్స్‌(Saraswati shares) అటాచ్‌ కాలేదు.. సరస్వతి షేర్స్‌ను వెంటనే ట్రాన్ఫర్‌ చేస్తామని ఎంవోయూలో రాశారని షర్మిల(YS sharmila) అన్నారు. అటాచ్‌ కాలేదని తెలుసు, అవి ట్రాన్ఫర్‌ చేయాలని కూడా మీకు తెలుసు. కన్నతల్లిని కోర్టుకు ఈడ్చడం ఘర్‌ ఘర్‌ కీ కహానీ. కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా..? అందరి ఇళ్లలో జరిగే విషయమే అన్నట్లు మాట్లాడుతున్నారు. మీకు మానవత్వం లేదా. ఎమోషన్స్‌, సెంటిమెంట్స్‌ లేవా అని షర్మిల ప్రశ్నించారు. సుబ్బారెడ్డి(Subba reddy) మాట్లాడితే నా కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు. నా బిడ్డలకు నిన్ను తాతా అని పిలవలేదా.. ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలని చేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. 2019లో 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని.. ఇదెలా సాధ్యమైందో వైసీపీ(YCP) కార్యకర్తలు ఆలోచించాలన్నారు. వైఎస్‌ ఆశయాలను నిలబెట్టాలన్న ఆశతో శ్రమిస్తే ఈ విజయం వచ్చిందన్నారు. నేను, అమ్మ చేతనైనవాటికంటే ఎక్కువే చేశాం. మోకాళ్ల నొప్పులు ఉన్నా కానీ అమ్మ ప్రచారం చేసింది. నేను కూడా 3200 కి.మీ.పాదయాత్ర చేశానని షర్మిల అన్నారు. నా ప్రాణాలు పోతాయని సూర్యుడి వరకు వెళ్లమన్నా వెళ్లేదాన్ని. నేనేం తప్పు చేశానో ఒక్క కారణం చెప్పాలని వైసీపీ నాయకులను షర్మిల ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తే నేను, అమ్మ తిరిగాం. పార్టీకి ఏ అవసరం ఉన్నా పనిచేశానన్నారు. బైబై బాబు అనే ఎలక్షన్‌ క్యాంపెయిన్ బెస్ట్ క్యాంపెయిన్‌గా నిలిచిందని పీకే అన్నారు. ఇంత చేసిన నాకు జగన్మోహన్‌రెడ్డి ఏం చేశారు. జగన్మోహన్‌రెడ్డి నాకు, నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారనడం పచ్చి నిజం.. ఇది అమ్మకు, నాన్నకు తెలుసన్నారు షర్మిల. అలాంటి జగన్‌ను వైసీపీ నేతలు మోస్తున్నారు. ఎంవోయూ ఐదేళ్లుగా నా దగ్గరే ఉన్నాయి.. ఈ ఐదేళ్లు ఎంవోయూ నా దగ్గర ఉన్నా ఎన్ని కష్టాలున్నా నేను వాటిని వాడుకోలేదు. రాజశేఖర్‌రెడ్డి పరువుపోతుందనే ఎంవోయూ ఎవరికీ ఇవ్వలేదన్నారు. ఈరోజు విజయమ్మను కోర్టుకు ఈడ్చారు అంటే దానికి కారణం ఎవరో చెప్పాలని షర్మిల అన్నారు. ఇది చూసేందుకే నేను బతికున్నానా అని ఆ తల్లి రోదిస్తోందని షర్మిల అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story