YS Sharmila: అక్కడే నిద్రపోయిన షర్మిల.. డిమాండ్ ఇదే!!
పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి ఆమెను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు నిరుద్యోగులకు మద్దతుగా చలో సెక్రటేరియట్ కు పిలుపు నిచ్చారు. నిన్న రాత్రి నుంచే పోలీసులు ఆంధ్రరత్న భవన్ వద్ద పోలీసులు మొహరించారు. రాత్రికి వైఎస్ షర్మిల అక్కడే బస చేశారు. దీంతో ఆమెను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఆంధ్రరత్న భవన్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. వైఎస్ షర్మిల మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపడతామని తెలపడంతో పోలీసులు మరింతగా బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్దయెత్తున పోలీసులు మొహరించి అటువైపు నుంచి ఎవరినీ రానివ్వడం లేదు.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. బైఠాయించి ఆమె నిరసన తెలిపారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. 23వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. కేవలం 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు.