వైసీపీ అధినేత జగన్ కు లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైసీపీ అధినేత జగన్ కు లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగినట్లు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు(Lavu Sri Krishna Devarayalu) లోక్ సభలో ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కామ్ పై వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్ పై సీబీఐ(CBI) విచారణకు ఆదేశించాలని కోరాలా? లేక సిట్(SIT) ను ఏర్పాటు చేసి విచారణ చేయించాలా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత జగన్ హయాంలో వైసీపీ(YCP) ప్రభుత్వమే లిక్కర్ షాపులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. లిక్కర్ షాపులను నిర్వహించడమే కాకుండా కేవలం నగదు లావాదేవీలను మాత్రమే అనుమతించింది. ఐదేళ్ల పాటు డిజిటల్ లావాదేవీలను అనుమతించకపోవడంతో అప్పటి కూటమి పార్టీల నేతలు కూడా లిక్కర్ లో భారీగా స్కామ్ జరిగినట్లు ఆరోపించారు. వైసీపీ పాలనలో ఈ కుంభకోణం జరిగిందని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది, ఆయన అరెస్ట్‌ను నివారించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు మిథున్‌రెడ్డి(Mithun Reddy)కి తాత్కాలిక ఊరటనిచ్చి, సీఐడీని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. జగన్ విషయానికి వస్తే, ఈ మద్యం కేసులో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఇంకా బహిరంగంగా ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదు. అయితే, వైసీపీ హయాంలో మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని, రూ. 20 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది, జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఈ నిర్ణయాలకు ఆయన బాధ్యత వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. కానీ ఆధారాలు బలంగా ఉంటే జగన్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, జగన్‌ను అరెస్ట్ చేయాలంటే సీఐడీకి గట్టి ఆధారాలు, కోర్టు అనుమతి అవసరం.

ehatv

ehatv

Next Story