ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి గంటూరుకు వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి గంటూరుకు వెళ్లారు. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయిన సహానా(Sahana) కుటుంబానికి పది లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కడప జిల్లా బద్వేల్‌(badvel)లో విఘ్నేశ్‌(Vignesh) అనే వ్యక్తి పెట్రోల్ పోసి ఇంటర్‌ విద్యార్థిని తగలబెట్టాడు. 80 శాతం కాలిన గాయాలతో ఆమె కడప రిమ్స్‌(Kadapa Rims)లో చికిత్స పొందుతూ చనిపోయింది. బాధిత విద్యార్థిని కుటుంబానికి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆ నష్టపరిహారాన్ని బాధిత కుటుంబానికి ఇన్‌చార్జ్ క‌లెక్ట‌ర్ అదితిసింగ్‌(Aditi Singh), వైఎస్సార్ జిల్లా(YSr District) టీడీపీ అధ్య‌క్షుడు ఆర్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి(TDP R. Srinivas Reddy) త‌దిత‌రులు అంద‌జేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్(YS Jagan) బద్వేల్‌ వెళుతున్నారన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వెంటనే కుటుంబసభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఫోన్‌లో మాట్లాడారు. సాయాన్ని మరో 5 లక్షలకు పెంచారు. జగన్‌ బద్వేల్‌కు వెళ్లేలోపు ఆ నష్టపరిహారాన్ని అందించారు. జగన్ బద్వేల్‌కు వెళితే బాధిత కుటుంబానికి కచ్చితంగా 10 లక్షల రూపాయల సాయాన్ని ఇచ్చేవారు. అందుకే ప్రభుత్వం అయిదు లక్షల సాయాన్ని కాస్తా పది లక్షలు చేసింది.

ehatv

ehatv

Next Story