Ys jagan : అసెంబ్లీకి వస్తా.. అక్కడే పోరాడతా..!
![Ys jagan : అసెంబ్లీకి వస్తా.. అక్కడే పోరాడతా..! Ys jagan : అసెంబ్లీకి వస్తా.. అక్కడే పోరాడతా..!](https://www.ehatv.com/h-upload/2025/02/06/740677-whatsapp-image-2025-02-06-at-122659.webp)
బాబు ష్యూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ అని ప్రచారం చేశారు..బటన్ నొక్కడం గొప్పనా..ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అని అన్నారు..కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది..హామీలు గ్యారంటీ అని ఇంటింటికీ బాండ్లు కూడా పంచారు.
9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రికార్డులు బద్దలు కొట్టాయి..9 నెలల్లో బడ్జెటరీ అప్పులే రూ. 80,820 కోట్లు..9 నెలల్లో అమరావతి పేరు చెప్పి చేస్తున్న అప్పు రూ.52 వేల కోట్లు..APMDC ద్వారా మరో రూ. 5 వేల కోట్ల అప్పు...9 నెలల్లోనే ఏకంగా లక్షా 40 వేల కోట్లపైనే అప్పులు చేశారు..ఇన్ని అప్పులు చేసినా..సూపర్-6 ఇచ్చారా,పేదలకేమైనా బటన్లు నొక్కారా..గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమైనా కొనసాగుతున్నాయా.. అమ్మఒడి,రైతు భరోసా,వసతి దీవెన,విద్యాదీవెన, చేయూత,ఆసరా,వాహనమిత్ర,నేతన్న నేస్తం,చేదోడు,లా నేస్తం..గతంలో ఉన్న అన్ని పథకాలు పాయె..
రూ.1,40,000 కోట్ల అప్పులు ఎవరి జేబులోకి పోతున్నాయి..ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు కానీ..2 లక్షలకు పైగా వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారు..గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని కూడా ఇతర శాఖల్లో సర్దేస్తున్నారు..వాలంటీర్లను ఎలా మోసం చేశారో..ఉద్యోగుల్ని అలాగే మోసం చేస్తున్నారు.. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్న చంద్రబాబు..ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు..ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అని చెప్పి..ఉన్న పీఆర్సీ ఛైర్మన్ ను పంపించేశారు.. ఏ నెలలో ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చారో చెప్పాలి..ఇప్పుడు జరుగుతున్నది..ఆర్థిక విధ్వంసం..మా హయాంలో 4 పోర్టులు కట్టాం..10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు చేశాం.
ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళేది లేదు. మైక్ ఇవ్వటం ఇష్టం లేకే హోదా ఇవ్వటం లేదు.అసెంబ్లీ కి హాజరుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన వై.యస్.జగన్.
![ehatv ehatv](/images/authorplaceholder.jpg?type=1&v=2)