వైఎస్‌ జగన్ రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు.

వైఎస్‌ జగన్ రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో రాప్తాడు నియోజకవర్గానికి చేరుకున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయనను స్వాగతించారు. ఈ సందర్భంగా జగన్, కురుబ లింగమయ్య అనే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త హత్య ఘటనపై ఆ కుటుంబానికి భరోసా కల్పించారు, ప్రభుత్వంపై, ముఖ్యంగా టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. కొందరు స్థానిక పోలీసులు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారని, దీని వెనుక కూటమి నేతల కుట్ర ఉందని వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులు ఆరోపించారు. ఎన్.ఎస్ గేటు వద్ద పోలీసు వాహనాలతో రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం. అయితే వైసీపీ శ్రేణులు హెలికాప్ట‌ర్‌ను చుట్టుముట్టాయి. జ‌గ‌న్‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు, అలాగే ఆయ‌న్ను చూసేందుకు వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పోటెత్తారు. దీంతో హెలికాప్ట‌ర్ దెబ్బ‌తింది. తిరిగి వెళ్లే సమయానికి హెలికాప్టర్‌ సిద్ధంగా లేకపోవడంతో ఆయ‌న రోడ్డు మార్గాన బెంగ‌ళూరుకు ప్ర‌యాణం కావాల్సి వ‌చ్చింది. జగన్‌ అంటేనే జనంలో నుంచి పుట్టిన నాయకుడు అని కానీ జనం చెంతకు రావడం మానేశాడు. ఆయన అప్పుడప్పుడు జనంలో పర్యటిస్తే ఇంత ఒత్తిడి ఉండదనేది కార్యకర్తల మనోభావం. తరుచుగా జ‌గ‌న్ జ‌నంతో మ‌మేకం అవుతుంటే, ఆయ‌న్ను చూడాల‌ని ఇంత‌గా అభిమానులు పోటెత్తేవారు కాదు. త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చిన జ‌గ‌న్‌ను ఇప్పుడు చూడ‌లేక‌పోతే, మ‌ళ్లీ ఎప్పుడో అన్న ఆందోళనతోనే ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎగబడిపోయారు. అందుకే జ‌గ‌న్ నిత్యం జ‌నానికి చేరువ‌లో వుండేలా ప్రణాళికలు వేసుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ehatv

ehatv

Next Story