YS jagan protest : ఢిల్లీలో జగన్ ధర్నా సక్సెసైనట్టేనా?
తెలుగుదేశం పార్టీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వపై అరాచక పాలనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఢిల్లీలో ధర్నా చేసింది.
తెలుగుదేశం పార్టీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వపై అరాచక పాలనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఢిల్లీలో ధర్నా చేసింది. జంతర్‌మంతర్(Jantar mantar) దగ్గర చేపట్టిన ఈ ధర్నా తుస్సుమంటుందని అధికారపక్షం అనుకుంది. జగన్(YS jagan) ధర్నాను ఎవరూ పెద్దగా పట్టించుకోరని భావించింది. విపక్ష పార్టీలేవీ మద్దతు తెలపవని ఊహించింది. కానీ టీడీపీ అంచనాలు తప్పాయి. ఢిల్లీలో ధర్నా విజయవంతం అయినట్టే లెక్క! అందుకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు తెగ సంబరపడుతున్నాయి. నిజానికి ధర్నాకు ఇతర పార్టీల నేతలు వస్తారో, లేదో అనే ఆందోళన వైసీపీ నాయకులలో కూడా ఉండింది. సమాజ్‌వాదీ పార్టీ(Samajwad party) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్(Akilesh yadav) ధర్నాకు వెళ్లడంతో జాతీయ మీడియా అటెన్షన్ అటువైపు మళ్లింది. పైగా ఆయన జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావచ్చని వ్యాఖ్యానించడం వైసీపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో దారుణ పరాజయాన్ని చవి చూసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమని అనుకున్నారు. ఆ మాటకొస్తే జగన్మోహన్‌రెడ్డి కోలుకోవడానికే కొన్నేళ్లు పడుతుందని ఆ పార్టీ నాయకులే భావించారు. ఇంత తర్వగా పార్టీ కోలుకుంటుందని, జగన్ పోరాటానికి సిద్ధమవుతారని కార్యకర్తలే అనుకోలేదు. కానీ జగన్ పోరాడే అవకాశాన్ని టీడీపీనే కల్పించింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులకు దిగడంతో వాటిని ఎలా తిప్పికొట్టాలో ఆ పార్టీ అధినేతకు అర్థం కాలేదు. ఏపీలో నిరసనలు, ధర్నాలు చేయడం వల్ల లాభం లేదని తెలుసుకున్న జగన్ ఢిల్లీలో ధర్నా తలపెట్టారు. ఏపీలో శాంతిభద్రతలు లేకుండా పోయాయన్న విషయాన్ని ఢిల్లీలో చాటగలింది వైసీపీ. పైగా జగన్ ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీనే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ, అన్నా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ వర్గం), ఐయూఎమ్‌ఎల్ తదితర పార్టీలు వచ్చి సంఘభావం తెలిపాయి. మొత్తం మీద ఈ ధర్నా జగన్‌లో విశ్వాసాన్నినింపింది