YS Jagan: సీఎం జగన్ లో కాన్ఫిడెన్స్ గమనిస్తూ ఉన్నారా?
2014 నుంచి 2019 వరకూ, 2019 నుంచి ఇప్పటి వరకూ మీ బ్యాంకు అకౌంట్లు పరిశీలించుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. అధికార వైసీపీని అడ్డుకోడానికి టీడీపీ-జనసేన కూటమి ప్రయత్నాలను మొదలుపెడుతూ ఉంది. మరోవైపు వైసీపీ పలు ప్రాంతాల్లో నాయకులను మార్చుకుంటూ వెళుతూ ఉంది. అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. ఇక సిద్ధం సభలతో జనంలోకి కూడా వెళుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కేడర్ ను కూడా సమాయాత్తం దాదాపుగా చేసేసింది. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి అటు సభల్లోనూ, ఇటు అసెంబ్లీ లోనూ వచ్చేది తమ ప్రభుత్వమేనని తేల్చి చెబుతూ ఉన్నారు.
సిద్ధం సభల్లో సీఎం జగన్ మొదట తాము ఏమి చేసామో ఎంతో క్లారిటీగా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. ఆ తర్వాతనే ప్రత్యర్థుల మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. తమ ప్రభుత్వం మంచి చేసి ఉంటేనే ఓటు వేయమని ఎంతో హుందాగా జగన్ అడుగుతూ ఉండడం ప్రజలను ఆకట్టుకుంటూ ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా అదే ధోరణి సీఎం జగన్ లో కనిపిస్తూ ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ చెప్పిన ప్రతి హామీని అమలు చేశానని జగన్ చెప్పుకొచ్చారు. అందరూ కలసి తనను ఎదుర్కొనేందుకు వస్తున్నారని, ప్రజలు కూడా 2014 నుంచి 2019 వరకూ, 2019 నుంచి ఇప్పటి వరకూ మీ బ్యాంకు అకౌంట్లు పరిశీలించుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదన్నారు. తమ ప్రభుత్వం మంచి చేయలేదని భావిస్తే ప్రతిపక్షాలందరూ ఏకం కావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇస్తున్న మ్యానిఫేస్టోలో ఏ అంశాన్ని అమలు చేసే ఉద్దేశ్యం లేదన్నారు. చంద్రబాబు ఇచ్చే వాగ్దానాలకు 1.26 కోట్లు ఏడాదికి అవుతుందని జగన్ అన్నారు. గతంలో 650 హామీలిస్తే ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు పర్చలేదన్నారు. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించవాడు దోచుకోగలుతాడు అన్న సిద్ధాంతం చంద్రబాబుది అని అన్నారు. తాము గెలుస్తామని ధీమా ఉంటే ఇన్ని పొత్తులు, అన్ని ఎత్తులు ఎందుకని చంద్రబాబును ప్రశ్నించారు. హామీలు అమలు చేయని చంద్రబాబును 2024 ఎన్నికల్లో నమ్మడం ఎంత వరకూ సబబని ఆయన అన్నారు.