YS Jagan : అసెంబ్లీకి జగన్ వెళ్లరుగాక వెళ్లరు!
ఆంధ్రప్రదేశ్(Andhra Praesh) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) అసెంబ్లీకి(Assembly) వెళతారో వెళ్లరో అన్న అనుమానాలు పటాపంచలయ్యాయి
ఆంధ్రప్రదేశ్(Andhra Praesh) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) అసెంబ్లీకి(Assembly) వెళతారో వెళ్లరో అన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే లభించాయి. దాంతో జగన్మోహన్‌రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా అర్హత కూడా దక్కలేదు. ఇప్పుడాయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలో కూర్చోవాల్సి ఉంటుంది. మాట్లాడేందుకు తగిన సమయం కూడా ఆయనకు ఇవ్వరు. ఈ విషయం అందరికీ తెలుసు. అసెంబ్లీకి వెళ్లి అవమానం చెందడమెందుకని జగన్మోహన్‌రెడ్డి భావించి ఉంటారు. అందుకే ఆయన అసెంబ్లీకి వెళ్లనంటే వెళ్లనని చెప్పేశారు. అయితే అసెంబ్లీకి తాను ఎందుకు వెళ్లడం లేదన్న విషయం ప్రజలకు తెలియడం కోసమని ప్రతిపక్ష హోదా అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడాన్ని రాజకీయ విశ్లేషకులు(Political analyst) తప్పు పడుతున్నారు. ప్రజలు కూడా వెళితేనే బాగుంటుందని సూచన చేస్తున్నారు. ఉగ్యోగి ఆఫీసుకు ఎలా వెళతారో, కార్మికుడు పరిశ్రమకు ఎలా వెళతారో, రైతు పొలానికి ఎలా వెళతారో, ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి అలాగే పోవాలని అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ప్రతీసారి పని చేయదని చెబుతున్నారు. ఎవరెన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని సూచనలు చేసినా జగన్మోహన్‌రెడ్డి ఒక్కసారి డిసైడయ్యారంటే ఇక వెనక్కిపోరు. అంచేత ఆయన అసెంబ్లీకి వెళ్లరనే విషయం రూఢీ అయ్యింది. కాకపోతే అసెంబ్లీ సమావేశాలలో జరిగిన సమావేశాలపై ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్(Pressmeet) పెట్టి తన అభిప్రాయాలను చెబుతానని జగన్ ప్రకటించారు.