సీఎం జగన్ పై రాయి తగలడంతో ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది.

సీఎం జగన్ పై రాయి తగలడంతో ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్‌ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి సైతం గాయమైంది. వెంటనే సీఎం జగన్‌కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగించారు సీఎం జగన్‌. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని విజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్‌ నుండి సీఎం జగన్‌ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్‌ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్‌ కేసరపల్లి నైట్ హాల్ట్ శిబిరానికి చేరుకున్నారు. సీఎం జగన్‌తో పాటుగా వైఎస్‌ భారతీ ఉన్నారు.

గాయం కారణంగా సీఎం వైయస్ జగన్‌ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో నేడు సీఎం జగన్‌ యాత్రకు విరామం ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఘటనా స్థలాన్ని పోలీస్ అధికారులు పరిశీలించారు.

Updated On 13 April 2024 8:55 PM GMT
Yagnik

Yagnik

Next Story