మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ

వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు కొనసాగనుంది. రాళ్ల దాడిలో గాయపడిన తర్వాత ఒక్కరోజు విరామం అనంతరం తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజుకు సంబంధించిన షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్‌ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్‌ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. హనుమాన్‌ జంక్షన్‌ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ సింగ్‌ నగర్‌ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే రాళ్ల దాడికి పాల్పడ్డారు. సీఎం జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్‌ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మ పై భాగాన బలమైన గాయమైంది.

Updated On 14 April 2024 8:39 PM GMT
Yagnik

Yagnik

Next Story