రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ టీడీపీ-జనసేన పార్టీలపై విరుచుకుపడ్డారు.

రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ టీడీపీ-జనసేన పార్టీలపై విరుచుకుపడ్డారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధమని.. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదన్నారు.. ఎగ్గొట్టేవాడు 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తానని అంటాడన్నారు పవన్. మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తానంటాడని ఎలాంటి పరిస్థితుల్లో నమ్మకండని అన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలన్నారు సీఎం జగన్.

చంద్రబాబు చేస్తున్న అబద్ధ ప్రచారం గురించి ప్రజలకు వివరించి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు. రంగు రంగుల మ్యానిఫెస్టో పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఎవరికైనా సామాజిక న్యాయం గుర్తుకువస్తుందా? అని అడిగారు. తాము అధికారంలోకి రాకపోతే మళ్లీ మంచి పథకాలన్నీ అందకుండా పోతాయని జగన్ అన్నారు.

Updated On 18 Feb 2024 6:41 AM GMT
Yagnik

Yagnik

Next Story