వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని మంగళగిరిలో ఉన్న పాత బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటినగరం రోడ్‌ కాపు వీధి సర్కిల్‌లో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. మధ్యా­హ్నం 3 గంటలకు కడపలోని శ్రీపొట్టి శ్రీరాములు సర్కిల్‌లో జరిగే సభలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

సీఎం జగన్ తన పర్యటనల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతూ వైసీపీకి మళ్లీ ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ వెళుతున్నారు. తాను మంచి చేశానని భావిస్తేనే ఓటు వేయాలని కోరుతూ ఉన్నారు. చంద్రబాబుది ఉసరవెల్లి రాజకీయమని, మైనార్టీల ఓట్ల కోసం వారిపై కపట ప్రేమ కురిపిస్తున్నాడని జగన్ ధ్వజమెత్తుతూ ఉన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు డబ్బులు చెల్లించనివ్వకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కుట్ర పన్నాయని ఆరోపిస్తూ వస్తున్నారు.

Updated On 9 May 2024 9:24 PM GMT
Yagnik

Yagnik

Next Story