YS Jagan Pooja: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమ పాలన కొనసాగించాలని కోరుతూ తాడేపల్లిలో 41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించారు. నల్లపెద్ది శివరామప్రసాద శర్మ, గౌరవజ్జుల నాగేంద్రశర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. మొత్తం 45 మంది వేదపండితులు ఈ క్రతువులో పాల్గొన్నారు. వేదపండితులు ఆయనకు తీర్థం, ప్రసాదాలు అందజేశారు. యాగం నిర్వాహకులు అరిమండ వరప్రసాద రెడ్డి, విజయ శారద రెడ్డి, పడమట సురేష్ బాబు కూడా అక్కడే ఉన్నారు.
175 మంది సభ్యులున్న అసెంబ్లీ, మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసింది. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల త్రైపాక్షిక కూటమిని ఎదుర్కొంది. 2019లో వైఎస్సార్‌సీపీ 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక 25 లోక్‌సభ స్థానాలకు గానూ 22 స్థానాలను గెలుచుకుంది.